
● కమనీయం.. రథోత్సవం
తిరుమంజన
రథోత్సవం
తిరువొత్తియూరు: ప్రసిద్ధ చిదంబరం నటరాజ స్వామి ఆలయంలో ఆణి తిరుమంజన ఉత్సవాలు గత నెల 23వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రోజూ ఉదయం, సాయంత్రం పంచమూర్తి ఊరేగింపు నిర్వహించారు. కాగా ఆణి తిరుమంజన ఉత్సవంలో ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని మంగళవారం ఉదయం జరిగింది. సోమవారం ఉదయం చిత్ సభ నుంచి బయలదేరిన శివకామ సుందరి సమేత నటరాజమూర్తి, వినాయగర్, మురుగర్ చండికేశ్వరులను కీల్ రథంవీధిలోని ప్రత్యేక రథాల్లో ఉరేగించారు. రథానికి ప్రత్యేక దీపారాధన తర్వాత, శివ భక్తులు డప్పు, మంగళ వాయిద్యలతో శివ కీర్తనలు వినిపించారు. తేవారం, తిరువాసం ఇతర భక్తి గీతాలను పాడుతూ వుండగా రథం ఊరేగింపు నిర్వహించారు. ముందుగా గణేశుడి రథం బయలుదేరింది. దాని తర్వాత చండికేశ్వరర్, మురుగన్, నటరాజ, అమ్మన్ రథాలు ఒకదాని తర్వాత ఒకటి బయలుదేరాయి. ముందుగా మహిళలు వీధులను ముగ్గులతో అలంకరించారు. భక్తులు శివుడు, పార్వతి వేషధారణలో నత్యం చేశారు. ఈ రథోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. కాగా జూలై 2వ తేదీ సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు శివకామసుందరి సమేత నటరాజానికి మహాభిషేకం, చీరాభిషేకం, పుష్పాంజలి నిర్వహించారు.