
నంది నదిలో ఇసుక ట్రాక్టర్ సీజ్
తిరుత్తణి: తిరుత్తణి సమీపంలోని నది నదిలో ఇసుక చోరీ చేసిన ట్రాక్టర్‌ను పోలీసులు సీజ్ చేశారు. తిరుత్తణి ప్రాంతంలో ఇసుకకు డిమాండ్ విపరీతంగా ఉంది. దీంతో కొంతమంది రాత్రి వేళల్లో వాగులు, వంకలు, నదుల నుంచి ఇసుక చోరీ చేసి లారీలు, ట్రాక్టర్లలో తరలించి అధిక ధరలకు విక్రయించి లబ్ధి పొందుతున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తెక్కళూరు నంది నదిలో ట్రాక్టర్‌లో ఇసుక తరలిస్తుండగా గుర్తించిన పోలీసులు నిందతులను పట్టుకునే ప్రయత్నంలో ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు కూలీలు పరారయ్యారు. పోలీసులు ట్రాక్టర్ సీజ్ చేసి పరారైన వ్యక్తుల కోసం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.