
పదోన్నతులు కల్పించాలని ధర్నా
వేలూరు: ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లకు సీనియారిటీ ప్రకారం ప్రభుత్వం పదోన్నతులు కల్పించాలని తమిళనాడు హయ్యర్ సెకండరీ పాఠశాల టీచర్‌ల సంఘం ఆధ్వర్యంలో వేలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఆ సంఘం జిల్లా కార్యదర్శి మంజుల అధ్యక్షత వహించారు. ఇండియన్ స్కూల్ టీచర్స్ ఫెడరేషణ్ అఖిల భారత కార్య నిర్వహక కమిటీ సభ్యులు జనార్ధనన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వం సీనియారిటీ కలిగిన టీచర్‌లకు హెచ్‌ఎంలుగా పదోన్నతులు కల్పించాలని, పబ్లిక్ కౌన్సెలింగ్ ద్వారా ట్రాన్స్‌ఫర్‌లు కల్పించాలని కోరారు. అడ్మినిస్టేషన్ బదిలీ పేరుతో జరుగుతున్న అక్రమాలను నిలిపి వేయాలని, టీచర్‌లకు ఉద్యోగ భద్రత చట్టాన్ని అమలు చేయాలని, అరియలూరు జిల్లాలో పాఠశాల ఆవరణంలోనికి చొరబడి హెచ్‌ఎంకు హత్యా బెదిరింపులు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేయాలని తదితర డిమాండ్‌లు పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ ధర్నాలో జిల్లా అధ్యక్షులు జయకుమార్, తమిళనాడు ప్రాథమిక పాఠశాల టీచర్స్ కూటమి జిల్లా కార్యదర్శి జోసెఫ్ అన్నయ్య, గ్రాడ్యుయేట్ టీచర్స్ అసోషియేషన్ జిల్లా అద్యక్షులు సెల్వకుమార్, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు జోషి, కార్యదర్శి దీన దయాళన్, ఇళంగో తదితరులు పాల్గొన్నారు.