
జోరువానలో డీఎంకే బహిరంగ సభ
యువతకు క్రీడా ఉపకరణాలు పంపిణీ
తిరుత్తణి: జోరువానలో డీఎంకే బహిరంగ సభ నిర్వహించి, యువకులకు క్రీడా సామగ్రి పంపిణీ చేశారు. డీఎంకే యువజన విభాగం తిరుత్తణి తూర్పు మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి డీఎంకే ప్రభుత్వం నాలుగేళ్ల పాలనపై అవగాహన కల్పించేందుకు బహిరంగ సభ నిర్వహించారు. ఆ పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కిరణ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొన్నారు. గ్రామీణ మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ సమావేశం మధ్యలో వర్షం వచ్చినా మహిళలు వేచివుండి ఆ పార్టీ ప్రచారకర్త సేలం సుజాత ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. పెద్ద వానలోనూ మహిళలు గొడుగుల సాయంతో డీఎంకే బహింరగ సభకు హాజరుకావడం ఆనందంగా ఉందని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. బహిరంగ సభలో భాగంగా యువకులకు యువజన విభాగం ఆధ్వర్యంలో క్రీడా సామగ్రిని ఎమ్మెల్యే చంద్రన్ అందజేశారు. మండల కార్యదర్శి ఆర్తి రవి, యువజన విభాగం మండల కన్వీనర్ కాళిదాస్ తదితరులు పాల్గొన్నారు.