
టీవీకే తీర్థం పుచ్చుకున్న మహిళలు
పళ్లిపట్టు: పట్టణానికి సమీపంలోని నొచ్చిలిలో టీవీకే ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వంద మందికి పైగా మహిళలు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఢిల్లీబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నటుడు విజయ్ ఆధ్వర్యంలో తమిళన వెట్రి కళగం పార్టీలో చేరేందుకు యువత, మహిళలు ఉత్సాహం చూపుతున్నారు. ఇందులో భాగంగా మండలంలోని నొచ్చిలి టీవీకే ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా విభాగానికి చెందిన వెన్మది ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఢిల్లీబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు వంద మంది టీవీకేలో చేరారు. వారికి పార్టీ జిల్లా కార్యదర్శి ఢిల్లీబాబు గుర్తింపు కార్డులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో యువత సత్తా చాటి తొలిసారిగా ద్రవిడ పార్టీలకు పోటీగా విజయ్ పార్టీ అధికారం చేపడుతుందన్నారు.