
తమిళం, తెలుగు భాషల్లో రాణిస్తున్న దక్షన్ విజయ్
తమిళసినిమా: సినిమా ఎల్లలు దాటి చాలా కాలం అయ్యింది. ప్రతిభ ఉంటే ఏ భాషలోనైనా రాణించవచ్చు. అలా మాతృభాషలోనే కాకుండా మలయాళంలోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటున్న తమిళ నటుడు దక్షన్ విజయ్. తమిళంలో కబలిహరం అనే చిత్రంలో హీరోగా నటించి తన నటనకు ప్రశంసలు అందుకున్న ఈయనకు మలయాళంలోనూ అవకాశాలు వరిస్తున్నాయి. ఇప్పటికే ఇత్తికర కొంబన్ అనే మలయాళ చిత్రంలో నటించి పేరు తెచ్చుకున్న దక్షన్ విజయ్‌కు తాజాగా మరో అవకాశం వచ్చింది. ఈయన ముఖ్యపాత్ర పోషిస్తున్న సొప్నంగళ్ విరుక్కన్న చందిరనగర్ అనే చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అలాగే తమిళంలో ఈయన నటించిన అయామ్ వెయిటింగ్ అనే చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, త్వరలోనే తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇలా తమిళం, మలయాళం భాషల్లో నటిస్తూ తన కంటూ గుర్తింపును తెచ్చుకుంటన్న నటుడు దక్షన్ విజయ్ నటించే మరిన్ని కొత్త చిత్రాలు చర్చల్లో ఉన్నాయి. నటనకు అవకాశం ఉంటే ఎలాంటి కథా పాత్రలోనైనా నటించడానికి సిద్ధం అంటున్నారీయన.