
నేరాల నియంత్రణకు తనిఖీలు
శ్రీకాకుళం క్రైమ్: నేరాల నియంత్రణ, అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అరికట్టే చర్యల్లో భాగంగా శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులు శుక్రవారం నగరంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ ఈశ్వరరావు సిబ్బందితో కలిసి చౌదరి సత్యనారాయణ కాలనీలో తనిఖీలు చేశారు. గంజాయి, మద్యం, నాటుసారా, నిషేధిత పదార్థాలు, అక్రమ నిల్వలపై ఆరా తీశారు. సరైన పత్రాలు లేని 19 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
రణస్థలం: నేర నియంత్రణ, అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలు అరికట్టే చర్యలలో భాగంగా జె.ఆర్.పురం పంచాయతీ వెంకటేశ్వర కాలనీలో కార్చెన్ సెర్చ్ నిర్వహించినట్లు జె.ఆర్.పురం సీఐ ఎం.అవతారం తెలిపారు. పత్రాలు లేని 19 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తనిఖీల్లో జే.ఆర్.పురం, లావేరు, జి.సిగడాం ఎస్సైలు ఎస్.చిరంజీవి, లక్ష్మణరావు, మధుసూదనరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

నేరాల నియంత్రణకు తనిఖీలు

నేరాల నియంత్రణకు తనిఖీలు