త్యాగానికి ప్రతీక బక్రీద్‌ | - | Sakshi
Sakshi News home page

త్యాగానికి ప్రతీక బక్రీద్‌

Jun 6 2025 6:23 AM | Updated on Jun 6 2025 6:23 AM

త్యాగ

త్యాగానికి ప్రతీక బక్రీద్‌

పుట్టపర్తి టౌన్‌: త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్‌ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో ముఖ్యమైనది బక్రీద్‌. ఇబ్రహీం అలైహిస్సలాం, ఆయన కుమారుడు ఇస్మాయిల్‌ అలైహిస్సలాం త్యాగస్మరణకు గుర్తుగా శనివారం ఉదయం 8 గంటలకు మసీదులు, ఈద్గాహ్‌ల వద్ద ‘ఈద్‌ – ఉల్‌ – అదాహ్‌’ను వేలాదిమంది ముస్లింలు ఆచరించనున్నారు. ఇందుకోసం మసీదులు, ఈద్గాలు ముస్తాబయ్యాయి. త్యాగానికి ప్రతిరూపమైన బక్రీద్‌ పండుగలో ‘ఖుర్బానీ’ చేసేందుకు జిల్లా ముస్లింలు సిద్ధమయ్యారు. నమాజు అనంతరం తమ శక్తికి తగినట్లుగా పొట్టేళ్లు, మేకపోతులను ఖుర్బానీ చేసి ఆ మాంసాన్ని పంచిపెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

బక్రీద్‌ విశిష్టత..

బక్రీద్‌ పండుగ సందర్భంగా ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే ఖుర్బానీ అంటే సమర్పణ, త్యాగం, బలి అని అర్థం. సుమారు 4వేల ఏళ్ల క్రితం ఇరాక్‌ దేశంలో పండిత కుటుంబంలో జన్మించిన దైవ ప్రవక్త హజ్రత్‌ ఇబ్రహీంకు (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒకరోజున కల వచ్చింది. ఆ స్వప్నంలో తన 86 ఏళ్ల వృద్ధాప్యంలో జన్మించిన ఏకై క కుమారుడు ఇస్మాయిల్‌ను ఖుర్బానీ చేయాలని అల్లాహ్‌ కలలో ఇబ్రాహీంను ఆదేశించినట్లు కల సారాంశం. అల్లాహ్‌ ఆదేశానుసారం తన కుమారుడిని బలి ఇవ్వడానికి ఇబ్రహీం సిద్ధం కాగా అల్లాహ్‌ దానిని స్వీకరించి ఇస్మాయిల్‌కు బదులు స్వర్గం నుంచి ఓ పొట్టేలును పంపి ఖుర్బానీ జరిగేలా చేశారు.

రేపు ‘ఈద్‌ – ఉల్‌ – అదాహ్‌’

జిల్లా వ్యాప్తంగా ఈద్గా, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు

త్యాగ నిరతిని కలిగి ఉండాలి

బక్రీద్‌ పండుగ అనేది త్యాగానికి ప్రతీక. ఖుర్బానీ అంటే జంతుబలి కాదు, మానవుడు దైవమార్గంలో తన సర్వస్వాన్ని త్యజిస్తానని చేసే ప్రకటన మాత్రమే. దైవాన్ని విశ్వసించడం, మానవులంతా ఒకటేనని నమ్మాలి. చెడును నిరోధించడం, మంచిని పెంచడం, కష్టాలలో సహనం వహిస్తూ, త్యాగ నిరతిని చూపించాలన్న సందేశమే ఖుర్బానీలో దాగి ఉంది.

– జాకీర్‌ ముక్తా సాహెబ్‌, ముతవల్లి, పుట్టపర్తి

త్యాగానికి ప్రతీక బక్రీద్‌ 1
1/1

త్యాగానికి ప్రతీక బక్రీద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement