
మైనింగ్ మాఫియాపై ఇక యుద్ధమే
వేమిరెడ్డి కబంధ హస్తాల్లో మైనింగ్
నెల్లూరు (పొగతోట): జిల్లాలో మైనింగ్ మాఫియా దాష్టీకాలపై ఇక ప్రత్యక్ష యుద్ధమే ప్రారంభమవుతుందని, ఈ మైన్లపై ఆధారపడిన వేలాది మంది ప్రజలతో కలిసి మాఫియాను అష్టదిగ్బంధం చేస్తామని మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ హెచ్చరించారు. ఆదివారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ.వేల కోట్లకు అధిపతినని గర్వంగా చెప్పుకునే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మొత్తం మైనింగ్‌ను తన గుప్పెట్లోకి తీసుకుని వందల మంది మైనింగ్ యజమానులు, వేలాది కూలీలు, రవాణాదారుల కడుపులు కొట్టి సంపాదించడం దేనికని ప్రశ్నించారు. దాదాపు 11 నెలలుగా పేద ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా.. మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు అన్నం పెట్టిన వెంకటగిరి రాజ కుటుంబీకులు, తమ మైన్ల ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారన్నారు. అటువంటి మైన్లను కూడా మూతవేశారని, వాటిని తెరిపించాలని ప్రాధేయపడినా పట్టించుకోవడం లేదన్నారు. ఎంపీ వేమిరెడ్డి అక్రమాలకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని, ఆయనపై కేసులు నమోదు చేసేదాకా వదలనని చెప్పారు. సోమవారం కలెక్టర్‌ను కలిసి ఆధారాలతో ఫిర్యాదు చేస్తానన్నారు.
నాపైనా తప్పుడు ప్రచారం
ఎన్నికల్లో ఓడిన నాటి నుంచి అనిల్‌కుమార్ యాదవ్ మైనింగ్‌లో రూ.వేల కోట్లు అక్రమంగా దోచుకున్నాడని విష ప్రచారం చేస్తున్నారన్నారు. నిజానిజాలు రాబోయే రోజుల్లో అన్నీ బయటకు వస్తాయన్నారు. మైనింగ్‌తో నాకేం సంబంధం లేకపోయినా తప్పుడు ప్రచారం ఆపడం లేదన్నారు. ఇప్పటిలా మా ప్రభుత్వంలో మైన్లను ఆపేశామా? మైనింగ్ యజమానులు, కూలీలు రోడ్డున పడిన రోజులున్నాయా? ఒక్కరైనా నా మీద ఫిర్యాదు చేశారా? అని ప్రశ్నించారు. ఓటమి తర్వాత నాకున్న కొన్ని వ్యక్తిగత కారణాలతోపాటు ఏడాది పాటు అధికార పార్టీకి సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతో రాజకీయ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉన్న మాట వాస్తవమే అన్నారు. అయినప్పటికీ పార్టీని, కార్యకర్తలను ఏనాడూ విడిచి పెట్టలేదన్నారు. అయితే కొంతమంది నాకు, మా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేశారన్నారు. నా చిత్తశుద్ధి నాకు, మా అధినేతకు తెలుసన్నారు.
కాకాణికి అండగా ఉంటా
కొంత కాలంగా మా పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీద కూడా కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తోందన్నారు. కాకాణి మీద నమోదైన కేసుల్లో న్యాయ స్థానాలను ఆశ్రయించడం జరిగిందన్నారు. ఆయనకు నాతోపాటు పార్టీ కూడా ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. పార్టీ కోసం పోరాడుతున్న వ్యక్తుల మీద కేసులు బనాయించినంత మాత్రాన వైఎస్సార్‌సీపీ వెనకడుగు వేస్తుందని వారు అనుకుని ఉండొచ్చు.. కానీ అది ఎప్పటికీ జరగదని కూటమి నాయకులు గుర్తుంచుకోవాలన్నారు.
కోర్టులు ఆదేశించినా..
ఫెమీ లేఖ రాసినా లెక్కే లేదు
వెంకటగిరి రాజాల మైన్లతో సహా జిల్లాలో చాలా మైన్లు మూతేశారు
ఎంపీ వేమిరెడ్డిపై కేసులు
నమోదు చేసేదాకా వదలను
ఆయన అక్రమాలపై
నావద్ద అన్ని ఆధారాలున్నాయి
కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తా
మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్
కూటమి ప్రభుత్వం వచ్చాక మైనింగ్ పనులు ఆపేయడంతో దాదాపు 10 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. మైనింగ్ జరుగుతున్న గూడూరు, సైదాపురం ప్రాంతాలకు వెళ్తే అక్కడి పరిస్థితులు తెలుస్తాయన్నారు. మైనింగ్ పనులు జరుగుతుంటే పరోక్షంగా వాటిపై ఆధారపడి వ్యాపారం చేసుకుంటున్న హోటళ్ల యజమానులు, టిప్పర్ యజమానులు, పెట్రోల్ బంకులు.. ఇలా అన్ని వ్యాపారాలు మూతపడ్డాయి. ఈ విషయమై మైన్ల యజమానులు కోర్టును ఆశ్రయిస్తే.. వెంటనే ఓపెన్ చేయాలని ఆదేశించినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోతున్నాయని మైన్లను ఓపెన్ చేయాలని మైనింగ్ సెక్రటరీకి ఫెమీ (ఫెడరేషన్ ఆఫ్ మైనర్ మినరల్స్ ఇండస్ట్రి– ఇండియా) లేఖ కూడా రాసిందని, నేరుగా ట్విట్టర్లో ముఖ్యమంత్రిని ట్యాగ్ చేసి ఫెమీ ట్వీట్లు కూడా చేసింది. మంద కృష్ణ నేతృత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు పామూరు వెళ్లి మైనింగ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారన్నారు. కనీసం పేదలనే కనికరం కూడా లేకుండా ఈ కూటమి నేతలు, ఎంపీ వేమిరెడ్డి దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. లక్ష్మి క్వార్ట్ ్జ శాండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారంటే మతలబు ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు. తర్వాత ఫిని క్వార్ట్ ్జపేరుతో దీనికొక సిస్టర్ కంపెనీ ఓపెన్ చేసి ఇందులో మన్నెమాల విజయకుమార్‌రెడ్డిని డైరెక్టర్‌గా చేశారన్నారు. ఈయన ఎవరికి ఆప్తుడనేది నెల్లూరు ప్రజలందరికీ తెలుసన్నారు.