సెల్ఫీ ఇవ్వ‌ని ట్రావిస్ హెడ్‌.. మండిప‌డుతున్న‌ ఫ్యాన్స్! వీడియో | Travis Head Trolled For Skipping Selfie With Fans | Sakshi
Sakshi News home page

IPL 2025: సెల్ఫీ ఇవ్వ‌ని ట్రావిస్ హెడ్‌.. మండిప‌డుతున్న‌ ఫ్యాన్స్! వీడియో

Apr 8 2025 5:53 PM | Updated on Apr 8 2025 6:57 PM

Travis Head Trolled For Skipping Selfie With Fans

ఆస్ట్రేలియా స్టార్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ నెటిజ‌న్ల‌ అగ్ర‌హానికి గుర‌య్యాడు. ఓ మ‌హిళా అభిమానితో హెడ్‌ సెల్ఫీ తీసుకోవడానికి నిరాకరించడమే ఇందుకు కార‌ణం. ఐపీఎల్‌-2025లో వ‌రుస ఓట‌ముల‌తో స‌త‌మ‌త‌వుతున్న ఎస్ఆర్‌హెచ్ త‌మ త‌దుప‌రి మ్యాచ్‌లో హైదరాబాద్ వేదిక‌గా  ఏప్రిల్ 12న పంజాబ్ కింగ్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

ఈ క్ర‌మంలో ట్రావిస్‌ హెడ్ తాజాగా హైదరాబాద్ లోని ఓ సూపర్ మార్కెట్ కి వెళ్ళాడు  ఈ సంద‌ర్భంగా ఓ లేడి ఫ్యాన్ అత‌డికి వ‌ద్ద‌కు వ‌చ్చి సెల్ఫీ దిగేందుకు ప్ర‌య‌త్నించింది. అందుకు హెడ్ నో అంటూ  నిరాకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.

దీంతో హెడ్‌పై నెటిజ‌న్లు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నాడు. సెల్ఫీ ఇవ్వ‌డానికి అంత క‌ష్ట‌మా అని మండిప‌డుతున్నారు. అయితే మ‌రికొంత‌మంది హెడ్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఆట‌గాళ్ల‌ ప్రైవ‌సీని గౌర‌వించాల‌ని కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఈ ఏడాది సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ త‌మ స్దాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోతుంది. ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఐదు మ్యాచ్‌లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ.. కేవ‌లం ఒక్క విజయంతో పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్ధానంలో కొన‌సాగుతోంది. ట్రావిస్ హెడ్ కూడా త‌న మార్క్ చూపించ‌లేక‌పోతున్నాడు. ఐదు మ్యాచ్‌లు ఆడి 29.60 స‌గ‌టుతో 148 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement