T20 World Cup 2021 IND VS PAK: Kohli Becomes Joint Third Most Followed Athletes On Instagram - Sakshi
Sakshi News home page

T20 WC 2021 IND Vs PAK: మ్యాచ్‌కు ముందే కోహ్లి ఖాతాలో మరో రికార్డు

Oct 24 2021 7:06 PM | Updated on Oct 24 2021 8:23 PM

T20 World Cup 2021 IND VS PAK: Kohli Becomes Joint Third Most Followed Athletes On Instagram - Sakshi

Kohli Becomes Joint Third Most Followed Athlete On Instagram: టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా భారత్‌-పాక్‌ల మధ్య మరికొద్ది నిమిషాల్లో హై ఓల్టేజ్‌ పోరు ప్రారంభంకానుంది. మ్యాచ్‌ ప్రారంభం కోసం యావ‌త్ ప్ర‌పంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్య‌ధిక ఫాలోవ‌ర్స్ క‌లిగిన మూడో అథ్లెట్‌గా స‌రికొత్త రికార్డ్ సృష్టించాడు. 


ఈ జాబితాలో స్టార్‌ ఫుట్‌బాలర్లు క్రిస్టియానో రొనాల్డో, లియోనల్‌ మెస్సీ, నెయ్‌మార్ జూనియ‌ర్ తొలి మూడు స్థానాల్లో ఉండ‌గా.. తాజాగా కోహ్లి నెయ్‌మార్ సరసన చేరాడు. నెయ్‌మార్‌కు ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 163 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉండగా.. కోహ్లి కొద్ది గంటల ముందే ఈ సంఖ్యను చేరుకున్నాడు. ఈ జాబితాలో రొనాల్డో అత్యధికంగా 359 మిలియన్ల ఫాలోవ‌ర్స్‌ను కలిగి ఉన్నాడు. అతని తర్వాత అర్జెంటీనా స్టార్‌ ఆటగాడు మెస్సీ 277 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లతో రెండో స్థానంలో నిలిచాడు. కాగా, ఇదే ఏడాది మార్చిలో కోహ్లి 100 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ క్ల‌బ్‌లో చేరిన తొలి భార‌త క్రికెట‌ర్‌గా చ‌రిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
చదవండి: Shakib Al Hasan: టి20 ప్రపంచకప్‌లో షకీబ్‌ అరుదైన ఘనత
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement