Start Of India Vs West Indies 2nd T20I Pushed Back To 10pm IST, Know Why - Sakshi
Sakshi News home page

IND Vs WI 2nd T20: ఎట్టకేలకు గెలుపు రుచి చూసిన విండీస్‌..

Aug 1 2022 7:32 PM | Updated on Aug 2 2022 7:36 AM

Start of India vs West Indies 2nd T20I pushed back to 10pm IST  - Sakshi

టీమిండియాతో సోమవారం ఆలస్యంగా జరిగిన రెండో టి20 వెస్టిండీస్‌ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. కాగా తొలి టీ20 జరిగిన ట్రినిడాడ్ నుంచి ఇరు జట్ల లగేజీ సెయింట్ కిట్స్‌కి చేరడంలో జాప్యం చోటు చేసుకోవడంతో మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభం కానున్నట్లు విండీస్‌ క్రికెట్‌ తెలిపింది. 

"అనివార్య పరిస్ధితుల కారణంగా ట్రినిడాడ్ నుంచి సెయింట్ కిట్స్‌కి రావల్సిన ఇరు జట్ల లగేజీ ఆలస్యంగా వచ్చింది. దీంతో భారత్‌-విండీస్‌ మధ్య జరగాల్సిన రెండో టీ20 రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 12:30 గంటల(భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలు)కు ప్రారంభమవుతుంది. అభిమానులు, స్పాన్సర్‌లు, ప్రసార భాగస్వాములుకు అసౌకర్యం కలిగించినందుకు చింతిస్తున్నాం" అని క్రికెట్‌ వెస్టిండీస్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో విజయం సాధించిన భారత్‌ 1-0తో ఆధిక్యంలో ఉంది.
చదవండిRashid Latif: "పాకిస్తాన్‌ చేసిన తప్పే ఇప్పుడు భారత్ చేస్తోంది.. అది మంచిది కాదు "

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement