Life Ban On Football Club: 41 సొంత గోల్స్.. ఫుట్‌బాల్ క్లబ్‌పై జీవితకాల నిషేధం

41 సొంత గోల్స్ కొట్టి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో ఒక ఫుట్‌బాల్ క్లబ్‌పై జీవితకాల నిషేధం పడింది. ఆ క్లబ్‌లో ఉన్న నాలుగు టీమ్‌లకు ఈ నిషేధం వర్తించనుంది. వాస్తవానికి ఒక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పొరపాటున సొంత గోల్ చేయడం సహజమే. ఒక్కోసారి ఫన్నీగానూ ఇలాంటి సొంత గోల్స్ నమోదవుతాయి. ఒకటి.. రెండు అంటే పర్వాలేదు గానీ.. అదే పనిగా సొంత గోల్‌పోస్ట్‌పై దాడి చేయడం మ్యాచ్ ఫిక్సింగ్ కిందకు వస్తుంది. దీంతో ఆయా జట్టుపై జీవితకాల నిషేధం విధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
తాజాగా సౌతాఫ్రికా ఫుట్‌బాల్ క్లబ్ సామీ మైటీబర్డ్స్ విషయంలో అదే జరిగింది. మతియాసితో జరిగిన మ్యాచ్‌లో సామీ మైటీబర్డ్స్ 59-1 రికార్డు గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఇందులో 41 గోల్స్ సామీ మైటీబర్డ్స్ సెల్ఫ్ గోల్స్ ఉన్నాయి. నిబంధనల ప్రకారం సెల్ఫ్ గోల్ చేసే అది ప్రత్యర్థి ఖాతాలోకి వెళుతుంది. ఈ నేపథ్యంలో సామీ మైటీబర్డ్స్ జట్టులో ప్లేయర్ నెం-2 10 గోల్స్, ప్లేయర్ నెంబర్-5 20 గోల్స్, మరొక ప్లేయర్ 11 గోల్స్.. సెల్ఫ్ గోల్స్ కొట్టినట్లు మ్యాచ్ రిఫరీ వెల్లడించాడు. దీంతో ఉద్దేశ పూర్వకంగానే మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో సౌతాఫ్రికా లోయర్ డివిజన్‌లోని నాలుగు క్లబ్స్‌పై జీవితకాలం నిషేధం పడింది.
South African lower division side Matiyasi FC 🇿🇦 have been BANNED for life after beating Nsami Mighty Birds 59-1, with 41 of the goals scored as own-goals.
Matiyasi were vying for promotion to the Provincial ABC Motsepe League. pic.twitter.com/6D59M0dmy0
— Nuhu Adams ™️ (@NuhuAdams_) June 1, 2022