హర్మన్‌ప్రీత్‌పై స్మృతి ప్రశంసలు
ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్‌పై కొత్త కెప్టెన్ స్మృతి మంధాన ప్రశంసలు కురిపించింది. పదేళ్ల పాటు హర్మన్ నాయకురాలిగా అద్భుతంగా పని చేసిందని స్మృతి వ్యాఖ్యానించింది. హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీలో స్మృతి 48 వన్డేలు, 144 టి20 మ్యాచ్‌లు ఆడింది.
‘నీ సారథ్యంలో సుదీర్ఘ కాలం ఆడటం గౌరవంగా భావిస్తున్నా. పదేళ్ల నీ కెప్టెన్సీ చాలా అద్భుతంగా సాగింది. మున్ముందు ఇద్దరం కలిసి దేశానికి మరిన్ని విజయాలు అందించాలి’ అని స్మృతి తన ఇన్‌స్ట్రగామ్ అకౌంట్‌లో స్పందించింది. హర్మన్ సహచరులు జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, శ్రీచరణి రెడ్డి కూడా ఆమె కెపె్టన్సీ ప్రయాణాన్ని అభినందిస్తూ...తమ కెరీర్‌లో అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.


