రేపు విండీస్‌తో మూడో టీ20.. ఒక్క ఫిఫ్టీ కొడితే ఇన్ని రికార్డులా? | Sanju Samson Can-Broke-Several-Records-One-Fifty-Ahead-3rd-T20I Vs WI | Sakshi
Sakshi News home page

IND Vs WI: రేపు మూడో టీ20.. ఒక్క ఫిఫ్టీ కొడితే ఇన్ని రికార్డులా?

Oct 10 2026 5:48 PM | Updated on Oct 10 2026 6:04 PM

Sanju Samson Can-Broke-Several-Records-One-Fifty-Ahead-3rd-T20I Vs WI

Photo Credit: Twitter

వెస్టిండీస్‌తో రెండో వ‌న్డేలో అనూహ్య ఓట‌మి చ‌విచూసిన టీమిండియా రేపు ఇండోర్ వేదిక‌గా మూడో టీ20 మ్యాచ్‌కు సిద్ధ‌మ‌వుతోంది. అయితే రెండో టీ20లో ఓట‌మి పాలైన‌ప్ప‌టికీ, ఓపెన‌ర్ సంజూ శాంస‌న్ (41 బంతుల్లో 82 ప‌రుగులు) ఫామ‌లోకి రావ‌డం ఊర‌టనిచ్చే అంశం. దీంతో మూడో టీ20లో శాంస‌న్ మ‌రోసారి కీల‌క‌మ‌య్యే అవ‌కాశ‌ముంది. ఈ నేప‌థ్యంలో శాంస‌న్‌ను మూడో టీ20లో అనేక రికార్డులు ఊరిస్తున్నాయి.

100 సిక్స‌ర్ల రికార్డు..
రేపు జ‌ర‌గ‌బోయే మూడో టీ20లో శాంస‌న్ మ‌రో రెండు సిక్స‌ర్లు బాదితే అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో వంద సిక్స‌ర్లు పూర్తి చేసుకోనున్నాడు. రెండో టీ20లో నాలుగు సిక్స‌ర్లు బాదిన శాంస‌న్ ఖాతాలో ప్ర‌స్తుతం 98 సిక్స‌ర్లు ఉన్నాయి. రాబోయే మ్యాచ్‌లో శాంస‌న్ ఆ రెండు సిక్స‌ర్లు కొడితే టీమిండియా త‌ర‌ఫున టీ20ల్లో వంద సిక్స‌ర్లు బాదిన ఆరో క్రికెట‌ర్‌గా నిల‌వ‌నున్నాడు. ఓవ‌రాల్‌గా టీ20 క్రికెట్‌లో వంద లేదా అంత‌కంటే ఎక్కువ సిక్స‌ర్లు కొట్టిన జాబితాలో 45వ ఆట‌గాడిగా శాంస‌న్ నిల‌వ‌నున్నాడు.

టీమిండియా త‌ర‌ఫున‌ అత్య‌ధిక సిక్స‌ర్ల వీరులు..
రోహిత్ శ‌ర్మ- 205 సిక్స‌ర్లు
సూర్య‌కుమార్ యాద‌వ్‌- 179 సిక్స‌ర్లు
అభిషేక్ శ‌ర్మ- 136 సిక్స‌ర్లు
హార్దిక్ పాండ్యా- 126 సిక్స‌ర్లు
విరాట్ కోహ్లి- 124 సిక్స‌ర్లు

విండీస్‌పై అత్య‌ధిక ఫిఫ్టీలు..
రెండో టీ20లో హాఫ్ సెంచ‌రీ సాధించిన సంజూ శాంస‌న్‌కు విండీస్‌పై రెండో హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. ఈ నేప‌థ్యంలో శాంస‌న్ కేఎల్ రాహుల్ రెండు అర్థ‌సెంచ‌రీల రికార్డును స‌మం చేశాడు. రేపు జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో శాంస‌న్ మ‌రో ఫిఫ్టీ సాధిస్తే మాత్రం రిష‌బ్ పంత్ (మూడు అర్థ‌సెంచ‌రీలు) స‌ర‌స‌న చేర‌నున్నాడు. మ‌రో విష‌య‌మేంటంటే, శాంస‌న్ అంత‌ర్జాతీయ‌ టీ20ల్లో త‌న తొలి హాఫ్ సెంచ‌రీని విండీస్‌పైనే న‌మోదు చేశాడు.

గంభీర్ రికార్డుకు ఎస‌రు..
ఇక రేప‌టి మ్యాచ్‌లో అర్థ‌సెంచ‌రీ సాధిస్తే శాంస‌న్ మ‌రో రికార్డు కూడా త‌న ఖాతాలో వేసుకోనున్నాడు. వెస్టిండీస్‌పై అన్ని ఫార్మాట్లు క‌లిపి శాంస‌న్ నాలుగు అర్థ‌సెంచ‌రీలు చేశాడు. మ‌రొక్క అర్థ‌శ‌త‌కం సాధిస్తే గంభీర్ (4 ఫిఫ్టీలు) రికార్డును బ‌ద్ద‌లుకొట్ట‌నున్నాడు.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement