ప్రపంచ కరాటే పోటీలకు ప్రణవ్, కోచ్‌ కీర్తన్‌ | Pranav and Coach Keerthan to compete in World Karate Championships | Sakshi
Sakshi News home page

ప్రపంచ కరాటే పోటీలకు ప్రణవ్, కోచ్‌ కీర్తన్‌

Oct 12 2026 4:42 AM | Updated on Oct 12 2026 4:42 AM

Pranav and Coach Keerthan to compete in World Karate Championships

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ కరాటే చాంపియన్‌షిప్‌ పోటీల్లో హైదరాబాద్‌ నుంచి ఇద్దరు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. మునిపాల రామానుజ ప్రణవ్‌ 68 కేజీల విభాగంలో భారత జట్టు తరఫున బరిలోకి దిగనుండగా... భారత జట్టుకు హెడ్‌ కోచ్‌గా ఉన్న కొండ్రు కీర్తన్‌ జూనియర్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తాడు. ప్రపంచ కరాటే సమాఖ్య (డబ్ల్యూకేఎఫ్‌) ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకు పోలాండ్‌లోని బీల్‌స్కో బియా నగరం ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తుంది. క్యాడెట్, జూనియర్, అండర్‌–21 వయో విభాగాల్లో పోటీలు జరుగుతాయి. 

మంగళగిరిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో బీబీఏ తొలి సంవత్సరం విద్యార్థి అయిన ప్రణవ్‌ గతంలో కామన్వెల్త్‌ కరాటే చాంపియన్‌షిప్‌లో జూనియర్‌ టీమ్‌ కుమిటె ఈవెంట్‌లో రజతం, కుమిటె క్లబ్‌ కేటగిరీలో కాంస్యం సాధించాడు. అదే ఈవెంట్‌లో ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ ట్రోఫీ సాధించిన భారత జట్టుకు కొండ్రు కీర్తన్‌ కోచ్‌గా ఉన్నారు. ‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు. సరైన శిక్షణ, ప్రోత్సాహం లభిస్తే వారు అంతర్జాతీయస్థాయిలో మరిన్ని విజయాలు సాధిస్తారు’ అని కీర్తన్‌ తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement