
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్లు నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత గడ్డపై అడుగుపెట్టిన ఆసీస్ జట్టు.. బెంగళూరులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంప్‌లో బీజీబీజీగా గడుపుతోంది. అదే విధంగా రోహిత్ సారథ్యంలోని భారత జట్టు కూడా శుక్రవారం నుంచి తమ ప్రాక్టీస్‌ను ప్రారంభించింది. నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి జరగనున్న తొలి టెస్టుతో ఈ చారిత్రాత్మక సిరీస్ ప్రారంభం కానుంది.
ఆఖరి టెస్టును వీక్షించనున్న భారత ప్రధాని
ఇక ఈ సిరీస్‌లో ఆఖరి టెస్టు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా వీక్షించున్నట్లు తెలుస్తోంది. మోదీతో పాటు ఆస్ట్రేలియా దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా ఈ మ్యాచ్‌కు హాజరకానున్నట్లు సమాచారం. మార్చి 9 నుంచి అహ్మదాబాద్ టెస్టు ప్రారంభం కానుంది.
నాలుగు టెస్టుల షెడ్యూల్
1. ఫిబ్రవరి 9- 13: నాగ్‌పూర్
2. ఫిబ్రవరి 17- 21: ఢిల్లీ
3. మార్చి 1-5: ధర్మశాల
4. మార్చి 9- 13: అహ్మదాబాద్
చదవండి: Rahul Tripath: సూపర్ సిక్సర్.. సూర్యను గుర్తు చేసిన రాహుల్ త్రిపాఠి! కానీ సంతోషం లేదు..