
Courtesy: IPL Twitter
టీమిండియా మాజీ కెప్టెన్.. సీఎస్‌కే ఆటగాడు ఎంఎస్ ధోని టి20 క్రికెట్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఆఖర్లో వచ్చిన ధోని దనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన ధోని.. అదే జోరును ఈ మ్యాచ్‌లోనూ కనబరిచాడు. 6 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 16 పరుగులు సాధించిన ధోని టి20 క్రికెట్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. ధోని 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టి20 క్రికెట్‌లో ఏడు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
టీమిండియా ప్లేయర్లలో ఏడు వేల పరుగుల మార్క్‌ను అందుకున్న ఆరో ఆటగాడిగా ధోని నిలిచాడు. ఈ జాబితాలో కోహ్లి 10,326 పరుగులతో తొలి స్థానం, రోహిత్ శర్మ 9936 పరుగులతో రెండో స్థానంలో, శిఖర్ ధావన్ 8818 పరుగులతో మూడోస్థానం, సురేశ్ రైనా 8,654 పరుగులతో నాలుగో స్థానం, రాబిన్ ఊతప్ప 7120 పరుగులతో ఐదో స్థానంలో ఉండగా.. తాజాగా ధోని 7001 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 14562 పరుగులతో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
Most Runs in T20s by an Indian Player:
— SportsTiger (@sportstigerapp) March 31, 2022
Virat Kohli - 10326
Rohit Sharma - 9936
Shikhar Dhawan - 8818
Suresh Raina - 8654
Robin Uthappa - 7120
MS Dhoni - 7001
MS Dhoni became the 6th Indian to smash 7000 runs in T20 Cricket.
(📸: BCCI/IPL)#IPL2022 #TATAIPL2022 #CSK pic.twitter.com/D5xbPUMlTc