SA vs ENG: లార్డ్స్‌లో బ్రాడ్‌ వందో వికెట్‌ వెనుక పెద్ద కథే!

Kyle Verreynne Change Batting Position After Grandfather-ILL ENG vs SA - Sakshi

ఇటీవలే సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ల మధ్య లార్డ్స్‌ వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ 12 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. ఇదే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ సీనియర్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ ప్రొటిస్‌ బ్యాటర్‌ కైల్‌ వెరిన్నేను ఔట్‌ చేయడం ద్వారా లార్డ్స్‌ వేదికలో వందో వికెట్‌ సాధించాడు. టెస్టు మ్యాచ్‌లో ఒకే వేదికలో వంద వికెట్లు సాధించిన ఇంగ్లండ్‌ రెండో బౌలర్‌గా బ్రాడ్‌ నిలిచాడు. బ్రాడ్‌ లార్డ్స్‌లో వందో వికెట్‌ సాధించడం వెనుక ఒక చిన్న కథ దాగుంది.

అయితే అది బ్రాడ్‌ వెర్షన్‌ కాదు.. బ్రాడ్‌ ఖాతాలో వందో వికెట్‌గా వెనుదిరిగిన కైల్‌ వెరిన్నే వెర్షన్‌లో. విషయంలోకి వెళితే.. లార్డ్స్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌ను చూడడానికి వికెట్‌ కీపర్‌ కైల్‌ వెరిన్నే తాత(Grand Father)కూడా వచ్చారు. స్టాండ్స్‌లో కూర్చొని మ్యాచ్‌ ఆస్వాధిస్తున్న ఆయన సౌతాఫ్రికా బ్యాటింగ్‌ సమయంలో ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యారు. అతని పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో వెంటనే మెడికల్‌ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.

ఐసీయూలో ఉన్న తన తాత పరిస్థితిని సౌతాఫ్రికా క్రికెట్‌ సిబ్బంది వెరిన్నేకు వివరించారు. వాస్తవానికి వెరిన్నే ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి. అప్పటికే సరెల్‌ ఎర్వీని బెన్‌ స్టోక్స్‌ ఔట్‌ చేయడంతో ఐదో వికెట్‌ కోల్పోయింది. వెరిన్నే బ్యాటింగ్‌కు వెళ్లాల్సి ఉండగా.. అతని స్థానంలో మార్కో జాన్సెన్‌ను పంపించారు. ఇక వెరిన్నేను ఏడో స్థానంలో బ్యాటింగ్‌ రావాలని చెప్పింది. ఈలోగా వెరిన్నేకు తన తాతను చూసేందుకు వెళ్లమని చెప్పారట. అలా ఆసుపత్రిలో ఉన్న తాతను చూసి వెరిన్నే తిరిగి వచ్చాడు. 

తాత ఆలోచనలతో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కైల్‌ వెరిన్నే ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో వెరిన్నే వెనుదిరిగాడు. కాగా అతని రూపంలో బ్రాడ్‌కు లార్డ్స్‌లో వందో వికెట్‌ లభించింది. ఇలా తన తాతపై ప్రేమతో మ్యాచ్‌లో సరిగ్గా ఆడలేకపోయానని మ్యాచ్‌ ముగిసిన అనంతరం చెప్పుకొచ్చాడు. ఇదీ బ్రాడ్‌కు లార్డ్స్‌లో వందో వికెట్‌ దక్కడం వెనుక ఉన్న అసలు కథ.  ఇక ఇప్పటికే మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచిన సౌతాఫ్రికా మాంచెస్టర్‌ వేదికగా గురువారం నుంచి రెండో టెస్టు ఆడనుంది.

వెరిన్నే తాత పరిస్థితి బాగానే ఉండడంతో అతను రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని సీఎస్‌ఏ(క్రికెట్‌ సౌతాఫ్రికా) ప్రకటించింది.మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 12 పరుగుల తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో కగిసో రబడా దాటికి ఇంగ్లండ్‌ 165 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఓలీ పోప్‌ 73 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. రబడాకు ఐదు వికెట్లు దక్కాయి. ఇక దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌ళో 326 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం 161 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ 149 పరుగులకే  ఆలౌట్‌ కావడంతో ఇన్నింగ్స్‌ తేడాతో సౌతాఫ్రికా భారీ విజయాన్ని మూటగట్టుకుంది.

చదవండి: ఇంగ్లండ్‌ బౌలర్‌ అరుదైన ఫీట్‌.. టెస్టు క్రికెట్‌లో నాలుగో బౌలర్‌గా

SA Vs ENG: ఇంగ్లండ్‌ జట్టుకు ఘోర పరాభవం.. 19 ఏళ్ల తర్వాత తొలి సారిగా!

రీఎంట్రీ ఇవ్వనున్న ఆసీస్‌ వివాదాస్పద క్రికెటర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top