షోయబ్‍ మాలిక్‌తో విడాకులు: స్పందించిన సానియా తండ్రి | 'It Was A Khula': Sania Mirza's Father Breaks Silence On Separation With Shoaib Malik - Sakshi
Sakshi News home page

#Sania Mirza: షోయబ్‌కు విడాకులు: స్పందించిన సానియా తండ్రి.. ఆ పద్ధతి ప్రకారమే!

Published Sat, Jan 20 2024 4:57 PM

It Was Khula: Sania Mirza Father Breaks Silence On Separation With Shoaib Malik - Sakshi

Sania Mirza Takes 'Khula' From Shoaib Malik What It Means: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా- పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ల విడాకులు ఇరు దేశాల క్రీడావర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. అన్యోన్యంగా కనిపించే ఈ జంట మధ్య చిచ్చు రేపిందెవరంటూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. 

తాను పాకిస్తానీ నటి సనా జావెద్‌ను పెళ్లాడినట్లు తెలుపుతూ షోయబ్‌ మాలిక్‌ సోషల్‌ మీడియాలో ప్రకటించడమే ఇందుకు కారణం. సానియా- షోయబ్‌ విడిపోనున్నానరంటూ గత కొన్నాళ్లుగా వదంతులు వ్యాపించాయి.

అవే నిజాలు
ఈ క్రమంలో తాజాగా షోయబ్‌.. సనాతో తన పెళ్లిని ధ్రువీకరిస్తూ అవి రూమర్లుకావు నిజాలని తేల్చాడు. ఈ నేపథ్యంలో సానియాకు విడాకులు ఇచ్చిన తర్వాత.. ఈ వివాహం చేసుకున్నాడా? లేదంటే.. సానియానే షోయబ్‌తో బంధం తెంచుకుందా? అనే చర్చ మొదలైంది.

నా కూతురే స్వయంగా
ఈ నేపథ్యంలో సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్‌ మీర్జా ఈ కూతురి గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. ఈ మేరకు ఆయన పీటీఐతో మాట్లాడుతూ.. ఖులా పద్ధతి ప్రకారం సానియా షోయబ్‌కు విడాకులు ఇచ్చిందని స్పష్టం చేశారు. కాగా 2010లో సానియా- షోయబ్‌ల వివాహం జరుగగా.. 2018లో  ఈ జంటకు కుమారుడు ఇజహాన్‌ జన్మించాడు.

ఖులా అంటే..
ఇస్లామిక్‌ షరియా చట్టాల ప్రకారం.. వివాహిత తన భర్త నుంచి విడిపోవాలనుకుంటే ఖులా పద్ధతి పాటించవచ్చు. ఇందులో ఏకపక్షంగానే స్త్రీ తనంతట తాను నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. వివాహ సమయంలో భర్త తనకు ఇచ్చిన కానుకను తిరిగి పంపడం ద్వారా విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేయవచ్చు. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement