క్లీన్‌స్వీప్‌ లక్ష్యంగా... | India's First T20 Match Against South Africa Today, Check When And Where To Watch This Match | Sakshi
Sakshi News home page

IND W Vs SA W: క్లీన్‌స్వీప్‌ లక్ష్యంగా...

Jul 5 2024 4:08 AM | Updated on Jul 5 2024 11:06 AM

Indias first T20 match against South Africa today

నేడు దక్షిణాఫ్రికాతో భారత్‌ తొలి టి20 మ్యాచ్‌

రాత్రి 7 నుంచి స్పోర్ట్స్‌ 18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం 

చెన్నై: ఇప్పటికే వన్డే సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసి... ఏకైక టెస్టులో ఘనవిజయం సాధించి... జోరు మీదున్న భారత మహిళల క్రికెట్‌ జట్టు టి20 సిరీస్‌నూ దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉంది. దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య నేడు తొలి మ్యాచ్‌ జరుగుతుంది. 

బలాబలాలను పరిశీలిస్తే దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లోనూ భారత్‌దే పైచేయి ఉండటం ఖాయమనిపిస్తోంది. వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీతో అదరగొట్టిన స్మృతి మంధాన... ఏకైక టెస్టులో డబుల్‌ సెంచరీతో మెరిసిన షఫాలీ వర్మ అదే జోరును టి20 సిరీస్‌లోనూ కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదు. 

బౌలింగ్‌ విభాగంలో పేసర్లు రేణుక సింగ్, అరుంధతి రెడ్డి... స్పిన్నర్లు ఆశా శోభన, శ్రేయాంక పాటిల్‌ కీలకం కానున్నారు. దక్షిణాఫ్రికా అవకాశాలన్నీ కెపె్టన్‌ లౌరా వొల్‌వార్ట్, మరిజన్‌ కాప్, సునె లుస్‌ ఆటతీరుపై ఆధారపడి ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement