సిరాజ్‌ సంబరం.. సచిన్, అశ్విన్‌‌ రియాక్షన్‌ | India Vs England Ashwin Says Siraj Team Man Reacts To Sachin Tendulkar | Sakshi
Sakshi News home page

సిరాజ్‌.. నిన్ను చూసి గర్వపడుతున్నా‌: సచిన్‌

Feb 18 2021 10:38 AM | Updated on Feb 18 2021 1:20 PM

India Vs England Ashwin Says Siraj Team Man Reacts To Sachin Tendulkar - Sakshi

ఆ క్షణాన్ని నేనెంతగానో ఆస్వాదించాను. క్రీడాస్ఫూర్తి అంటే ఇదే. సహచరుల విజయాన్ని ఎంజాయ్‌ చేయడం అందులో ఓ భాగం.

న్యూఢిల్లీ: టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌పై క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘నిన్ను చూసి గర్వపడుతున్నా’’ అంటూ కొనియాడాడు. చెన్నైలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చెపాక్‌ మైదానంలో తొలి టెస్టులో ఎదురైన ఓటమికి, 317 పరుగుల తేడాతో గెలుపొంది బదులు తీర్చుకుంది. ఇక మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సొంత మైదానంలో చిరస్మరణీయ సెంచరీ(106- 14 ఫోర్లు, ఒక సిక్స్‌) తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శతకం పూర్తికాగానే హెల్మెట్‌ తీసి అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ సెలబ్రేట్‌ చేసుకున్నాడు. 

ఈ ఉద్విగ్న క్షణంలో అశ్‌ ఎంతగా సంబరపడ్డాడో, మరో ఎండ్‌లో అతడికి సహకారం అందించిన సిరాజ్‌ సైతం సంబరంతో గాల్లోకి పంచ్‌లు విసురుతూ అంతే ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఎంతగా వైరల్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీనిపై స్పందించిన సచిన్‌.. ‘‘అశ్విన్‌ సెంచరీ పట్ల సిరాజ్‌ స్పందన చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఆ క్షణాన్ని నేనెంతగానో ఆస్వాదించాను. క్రీడాస్ఫూర్తి అంటే ఇదే. సహచరుల విజయాన్ని ఎంజాయ్‌ చేయడం అందులో ఓ భాగం. టీమిండియా, సిరాజ్‌ను చూసి గర్వంగా ఉంది’’ అని పేర్కొన్నాడు. ఇక సచిన్‌ ట్వీట్‌కు స్పందించిన అశ్విన్‌.. సిరాజ్‌.. మంచి టీం మ్యాన్‌ అంటూ అతడిపై ప్రేమను కురిపించాడు. 

చదవండి: అశ్విన్‌‌ ఆల్‌రౌండర్‌ ర్యాంకు పైపైకి
చదవండి2008-2020: ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement