Ind Vs Eng: Trolls On Virat Kohli For Post Advertisements Amid Poor Form - Sakshi
Sakshi News home page

Trolls On Virat Kohli: వీడియో షేర్‌ చేసిన కోహ్లి! నువ్వు ఇందుకే పనికివస్తావంటూ ట్రోలింగ్‌..

Jul 18 2022 3:02 PM | Updated on Jul 18 2022 3:59 PM

Ind Vs Eng: Trolls On Virat Kohli For Post Advertisements Amid Poor Form - Sakshi

వీడియో షేర్‌ చేసిన కోహ్లి.. విరుచుకుపడుతున్న నెటిజన్లు.. ఎందుకంటే!

విరాట్‌ కోహ్లి.. గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ఈ పేరు మారుమ్రోగిపోతోంది. అయితే, ఈసారి తన అద్భుతమైన ఆట తీరుతో కాకుండా నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతూ విమర్శకుల నోళ్లకు పనిచెప్తున్నాడు ఒకప్పటి ఈ ‘రన్‌ మెషీన్‌’. అయినప్పటికీ పరుగుల రారాజు కోహ్లి ఎల్లప్పుడూ మాకు కింగేనంటూ అభిమానులు కామెంట్లు చేస్తుండగా.. దేశీ, విదేశీ క్రికెటర్లు సైతం అతడికి అండగా నిలుస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో మూడో వన్డేలోనూ కోహ్లి మరోసారి విఫలం కావడంతో ఈసారి ట్రోల్స్‌ మరింత ఎక్కువయ్యాయి. దీనికి తోడు మ్యాచ్‌ జరిగిన మరుసటి రోజే ఓ యాడ్‌కు సంబంధించిన వీడియో షేర్‌ చేసిన కోహ్లి.. ట్రోలర్స్‌కు మరింత పనిచెప్పాడు. కాగా మాంచెస్టర్‌ వేదికగా ఆదివారం(జూలై 17) ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కోహ్లి.. 22 బంతులు ఎదుర్కొని 17 పరుగులు చేశాడు.

అయితే, ఈ మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ అజేయ సెంచరీతో, హార్దిక్‌ పాండ్యా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చెలరేగడంతో భారత్‌ గెలిచి సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే.. సోమవారం కోహ్లి ట్విటర్‌ వేదికగా హెల్త్‌ సప్లిమెంట్‌ వెల్‌మ్యాన్‌కు సంబంధించిన యాడ్‌ షేర్‌ చేశాడు.

ఇందుకే పనికొస్తావు!
‘వెల్‌మ్యాన్‌.. ఆట మీది ఒత్తిడి తాలుకు ప్రభావం మన మీద పడనివ్వం.. అందుకు బదులుగా ఆటను మార్చుకుంటాం. నా కూపన్‌ కోడ్‌ నాన్‌స్టాప్‌తో కొనుగోలు చేస్తే స్పెషల్‌ ఆఫర్‌’’ అంటూ కోహ్లి ట్వీట్‌ చేశాడు. ఇక ఇందుకు స్పందించిన నెటిజన్లు అతడిపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.

‘‘ఆట మీద పూర్తి శ్రద్ధ తగ్గిపోయింది.. నువ్వు అస్సలు పాత కోహ్లివి కానే కాదు.. నిన్ను జట్టు నుంచి తప్పించాల్సిందే. ఆటపై దృష్టి పెట్టకుండా ఇలా సోషల్‌ మీడియాలో ప్రొడక్ట్స్ అమ్ముకుంటున్నావు. అయినా పరుగులే చేయలేని వాడికి విటమిన్స్‌ తీసుకుంటే ఏంటి? లేకపోతే ఏంటి?

ఇక అడ్వర్టైజ్‌మెంట్లు చేసుకుంటూ బతికెయ్‌! నువ్వు ఇందుకు పనికివస్తావు! అయినా సెంచరీ చేయాలంటే ఏదైనా కూపన్‌ ఉందా? ముందు అది తీసుకో’’ అని కామెంట్లు చేస్తున్నారు.  అయితే, ఫ్యాన్స్‌ మాత్రం ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడటం సరికాదని హితవు పలుకుతున్నారు.

చదవండి: Rohit Sharma: ఇంగ్లండ్‌ గడ్డ మీద గెలవడం అంత ఈజీ కాదు! అంతా వాళ్లిద్దరి వల్లే..
Lalit Modi- Sushmita Sen: ఆమె మా అమ్మ స్నేహితురాలు కాదు.. పుట్టుకతోనే సంపన్నుడిని!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement