
భారత్ గెలుపు
నాలుగో టీ20లో భారత్ విజయం సాధించింది. ఎనిమిది పరుగుల తేడాతో టీమిండియా గెలుపు సొంతం చేసుకుంది. స్కోర్లు: భారత్ 185/8, ఇంగ్లండ్ 177/8. ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2తో సమం అయింది. చివరి టీ20 మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారనుంది. ఈ నెల 20న భారత్- ఇంగ్లండ్‌ల మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనుంది.
ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
ఇంగ్లండ్ జట్టు ఏడో వికెట్ కోల్పోయింది. 153 పరుగుల వద్ద సామ్ కర్రన్ (5 బంతుల్లో 3) ఔట్ అయ్యాడు.
ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
ఇంగ్లండ్ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. 140 పరుగుల వద్ద మోర్గాన్ (4) ఔట్ అయ్యాడు. మోర్గాన్ (6బంతుల్లో 4) శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
ఇంగ్లండ్ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. స్టోక్స్( 23 బంతుల్లో 46, నాలుగు ఫోర్లు, మూడు సిక్స్‌లు) శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో సూర్య కుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
ఇంగ్లండ్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. 131 పరుగుల వద్ద బెయిర్‌స్టో (25) ఔట్ అయ్యాడు. బెయిర్‌స్టో (19 బంతుల్లో 25, రెండు ఫోర్లు, ఒక సిక్స్) రాహుల్ చాహర్ బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
100 పరుగులు దాటిన ఇంగ్లండ్ స్కోర్
13 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్ 100 పరుగుల మార్కును దాటింది. ఇంగ్లండ్ గెలవాలంటే 42 బంతుల్లో 86 పరుగులు సాధించాల్సి ఉంది. క్రీజ్‌లో స్టోక్స్(27), బెయిర్ స్టో(8) ఉన్నారు
మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
నిలదొక్కుకున్నట్లు కనిపించిన జేసన్ రాయ్(27 బంతుల్లో 40; 6 ఫోర్లు, సిక్స్) హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో సూర్యకుమార్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 8.5 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 66/3. క్రీజ్‌లో బెయిర్ స్టో(1), స్టోక్స్(0) ఉన్నారు
చాహర్ మ్యాజిక్.. మలన్(14) క్లీన్‌బౌల్డ్
స్పిన్నర్ రాహుల్ చాహర్ బౌలింగ్‌లో డేవిడ్ మలాన్(17 బంతుల్లో 14; సిక్స్) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 7.5 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 60/2. బెయిర్ స్టో క్రీజ్‌లో వచ్చాడు.
50 పరుగులు దాటిన ఇంగ్లండ్ స్కోర్
6.1 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 50 పరుగులు దాటింది. రాయ్(34), మలాన్(7) నిలకడగా ఆడుతున్నారు.
5 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ 31/1
బట్లర్ వికెట్ పడటంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆచితూచి ఆడుతున్నారు. క్రీజ్‌లో రాయ్(18 బంతుల్లో 17; 3 ఫోర్లు), డేవిడ్ మలాన్(6 బంతుల్లో 4) ఉన్నారు
తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
భువనేశ్వర్ బౌలింగ్‌లో రాహుల్ క్యాచ్ అందుకోడంతో ఇంగ్లండ్ ఓపెనర్ బట్లర్(6 బంతుల్లో 9; సిక్స్) పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో 2.5 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 15/1
భువీ తొలి ఓవర్ మొయిడిన్
186 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టును టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ కట్టడి చేశాడు. తాను వేసిన తొలి ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. క్రీజ్‌లో బట్లర్(0), జేసన్ రాయ్(6 బంతుల్లో 0) ఉన్నారు
టీమిండియా 185/8
నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ 185/8. ఆఖరి ఓవర్‌లో శార్ధూల్ ఠాకూర్ రెండు ఫోర్లు బాదడంతో టీమిండియా ఈ స్కోర్‌కు చేరుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ 4, మార్క్ వుడ్, రషీద్, స్టోక్స్, కర్రన్ తలో వికెట్ పడగొట్టారు
సుందర్(4) ఔట్
జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఆదిల్ రషీద్ బౌండరీ వద్ద అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో సుందర్ పెవిలియన్ బాట పట్టాడు. క్రీజ్‌లోకి భువనేశ్వర్ వచ్చాడు
అయ్యర్(37) ఔట్
ధాటిగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్(18 బంతుల్లో 37; 5 ఫోర్లు, సిక్స్) జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో మలాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. సుందర్ క్రీజ్‌లోకి వచ్చాడు
ఆరో వికెట్ కోల్పోయిన భారత్.. పాండ్యా(11) ఔట్
మార్క్ వుడ్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్ అద్భుతమైన క్యాచ్ అందుకోడంతో హార్ధిక్ పాండ్యా(8 బంతుల్లో 11; సిక్స్) అవుటయ్యాడు. దీంతో 18.5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 6/170. శ్రేయస్ అయ్యర్(16 బంతుల్లో 36; 5 ఫోర్లు, సిక్స్)కు జతగా శార్ధూల్ ఠాకూర్ బరిలోకి దిగాడు
ధాటిగా ఆడుతున్న అయ్యర్
18 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 5/167. క్రీజ్‌లో హార్ధిక్(4 బంతుల్లో 9; సిక్స్), శ్రేయస్ అయ్యర్(16 బంతుల్లో 36; 5 ఫోర్లు, సిక్స్) ఉన్నారు
పంత్(30) క్లీన్ బౌల్డ్
ఆర్చర్ బౌలింగ్‌లో బౌండరీ బాది ఊపుమీదున్నట్టు కనిపించిన రిషబ్ పంత్(23 బంతుల్లో 30; 4 ఫోర్లు) ఆ మరుసటి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యడు. దీంతో 16.2 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 5/144. క్రీజ్‌లోకి హార్ధిక్ పాండ్యా వచ్చాడు
15 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 4/128
క్రీజ్‌లో పంత్(20 బంతుల్లో 25; 3 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్(5 బంతుల్లో 11; 2 ఫోర్లు) ఉన్నారు
సూర్యకుమార్(57) ఔట్
థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి సూర్యకుమార్ యాదవ్(31 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అనవసరంగా బలయ్యాడు. సామ్ కర్రన్ బౌలింగ్‌లో డేవిడ మలాన్ అందుకున్న అనుమానాస్పద క్యాచ్ కారణంగా సూర్యకుమార్ పెవిలియన్‌కు చేరాడు. దీంతో 13.2 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 4/110. పంత్(15 బంతుల్లో 18; 2 ఫోర్లు)కు తోడుగా శ్రేయస్ అయ్యర్ క్రీజ్‌లోకి వచ్చాడు
సూర్యకుమార్ స్టన్నింగ్ ఫిఫ్టీ
బ్యాటింగ్ చేసేందుకు వచ్చిన తొలి అవకాశాన్ని సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 50; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) సద్వినియోగం చేసుకున్నాడు. దీంతో తొలి మ్యాచ్‌లోనే అర్ధశతకం సాధించిన 5వ టీమిండియా ఆటగాడిగా సూర్యకుమార్ రికార్డుల్లోకెక్కాడు. రెండో టీ20లో తుది జట్టులో స్థానం లభించినప్పటికీ.. అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.12.1 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 3/96
కోహ్లి(1) ఔట్
ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో కోహ్లి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి స్టంప్ అవుటయ్యాడు. 8.4 ఓవర్ల తర్వాత టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. క్రీజ్‌లోకి పంత్‌కు వచ్చాడు
రాహుల్ ఔట్(14), 7.4 తర్వాత టీమిండియా స్కోర్ 2/63
17 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 14 పరుగులు చేసిన రాహుల్.. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. క్రీజ్‌లోకి కెప్టెన్ కోహ్లి వచ్చాడు
సూర్యకుమార్ మెరుపులు
రోహిత్ అవుటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్.. వచ్చీ రాగానే సిక్సర్‌తో అలరించాడు. అనంతరం ఆదిల్ రషీద్ వేసిన 7ఓవర్‌లో వరుసగా ఫోర్, సిక్స్ బాది మాంచి ఊపులో ఉన్నట్టు కనబడుతున్నాడు. 7 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 1/59. క్రీజ్‌లో సూర్యకుమార్(15 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), కేఎల్ రాహుల్(16 బంతుల్లో 14; 2 ఫోర్లు)
5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 34/1
క్రీజ్‌లో సూర్యకుమార్(7 బంతుల్లో 11; ఫోర్, సిక్స్), కేఎల్ రాహుల్(11 బంతుల్లో 7; ఫోర్లు)
రోహిత్ శర్మ(12) ఔట్
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ(12 బంతుల్లో 12; 1 ఫోర్, సిక్స్) జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 3.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 1/21. క్రీజ్‌లోకి సూర్యకుమార్
టీమిండియా శుభారంభం.. తొలి ఓవర్ తర్వాత 0/11
క్రీజ్‌లో రోహిత్, రాహుల్.. తొలి బంతినే సిక్సర్‌గా మలచిన రోహిత్. తొలి ఓవర్ తర్వాత టీమిండియా స్కోర్ 0/11
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా టాస్ ఓడి.. ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగింది. మూడో టీ20లో పర్యాటక ఇంగ్లండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఘోరపరాభవాన్ని మూటగట్టుకున్న భారత్.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుతం సిరీస్‌లో 1-2తో వెనుకంజలో ఉన్న భారత్.. ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ కూడా ఈ మ్యాచ్‌ను ఎలాగైనా చేజిక్కించుకొని, టెస్టుల్లో ఎదురైన పరాభవానికి(సిరీస్ ఓటమి) ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది.
కాగా, ఇవాల్టి మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగనుండగా, ఇంగ్లండ్ మాత్రం గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతధంగా కొనసాగించనుంది. గత మ్యాచ్‌లో గాయపడిన ఇషాన్ కిషన్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌కు చోటు లభించగా, పేలవ ఫామ్‌లో ఉన్న చహల్ స్థానంలో మరో స్పిన్నర్ రాహుల్ చాహర్ బరిలోకి దిగనున్నాడు.
తుది జట్లు
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రాహుల్, సూర్యకుమార్, పంత్, అయ్యర్, హార్దిక్, సుందర్, శార్దుల్, భువనేశ్వర్, రాహుల్ చాహర్.
ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, బట్లర్, మలాన్, బెయిర్‌స్టో, స్టోక్స్, వుడ్, సామ్ కర్రన్, ఆర్చర్, రషీద్, జోర్డాన్.