Asia Cup 2022: టీమిండియాకు భారీ షాక్... గాయంతో స్టార్‌ బౌలర్‌ ఔట్‌..!

 Harshal Patel Set To Be Sidelined For Asia Cup Due To Injury - Sakshi

Harshal Patel: ప్రస్తుతం విండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతున్న టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. స్టార్‌ బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ మిగతా రెండు మ్యాచ్‌లతో పాటు త్వరలో ప్రారంభంకానున్న ఆసియా కప్‌కు (ఆగస్ట్‌ 27) దూరం కానున్నట్లు సమాచారం. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న హర్షల్.. మరో మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే హర్షల్‌.. ఆసియా కప్‌తో పాటు టీ20 వరల్డ్‌కప్‌కు (అక్టోబర్‌లో ప్రారంభం) కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదు. 

టీ20 స్పెషలిస్ట్‌గా ఇప్పుడిప్పుడే ఎదుగుతూ, వరల్డ్‌కప్‌ జట్టులో చోటు ఖాయం అనుకున్న తరుణంలో గాయం బారిన పడటం హర్షల్‌తో పాటు టీమిండియాకు కూడా గట్టి ఎదురుదెబ్బేనని చెప్పాలి. హర్షల్‌ గాయపడటంతో అతని స్థానాన్ని దీపక్‌ చహర్‌తో భర్తీ చేసే అవకాశం ఉంది. డెత్ ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడంతో పాటు కీలక సమయాల్లో బ్యాట్‌తోనూ రాణించే సత్తా ఉన్న హర్షల్‌.. టీమిండియా తరఫున 17 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ఆసియాకప్‌ కోసం భారత జట్టును ఈనెల 8న (ఆగస్ట్‌) ప్రకటించే అవకాశం ఉంది. 
చదవండి: 'కోహ్లి, హసన్ అలీ ఒకేలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top