BCCI: Postpones Cooch Behar Trophy Knockout Games After Massive Covid Outbreak Deets Inside - Sakshi
Sakshi News home page

Cooch Behar Trophy: మరో టోర్నీని వాయిదా వేసిన బీసీసీఐ

Jan 10 2022 10:01 PM | Updated on Jan 11 2022 10:44 AM

BCCI Postpones Cooch Behar Trophy Knockout Games After Massive Covid Outbreak - Sakshi

ముంబై: దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న వేళ మరో క్రికెట్‌ టోర్నీ వాయిదా పడింది. ఇప్పటికే రంజీ ట్రోఫీ, కల్నల్‌ సీకే నాయుడు ట్రోఫీలు పోస్ట్‌పోన్‌ కాగా, తాజాగా అండర్-19 కూచ్ బెహర్ టోర్నీ నాకౌట్‌ మ్యాచ్‌లను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.


ప్రస్తుతం టోర్నీ జరుగుతున్న పుణేలో కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో పాటు కొందరు ఆటగాళ్లు(ముంబై, సౌరాష్ట్ర) సైతం మహమ్మారి బారిన పడడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టోర్నీని వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది. కాగా, ఈ టోర్నీలో ముంబై, ఛత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్, రాజస్థాన్, విదర్భ, బెంగాల్, హర్యానా , మహారాష్ట్ర జట్లు ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకున్నాయి.
చదవండి: ఏడో ర్యాంక్‌లో ఉన్న టీమిండియాను నంబర్‌ వన్‌గా నిలబెట్టాను.. విరాట్‌ కోహ్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement