Ashes 2021-22 2nd Test: Pat Cummins Confirms Australia Playing, Comments On Warner - Sakshi
Sakshi News home page

Ashes 2021-22 Adelaide Test: రెండో టెస్టుకు ఆసీస్‌ తుది జట్టు ఇదే.. అతడు వస్తాడు: కెప్టెన్‌ కమిన్స్‌

Dec 15 2021 12:46 PM | Updated on Dec 15 2021 1:56 PM

Ashes 2021-22 Adelaide 2nd Test: Pat Cummins Confirms Australia Playing XI - Sakshi

PC: Cricket Australia

Adelaide Test- Australia Playing XI: ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో భాగంగా జరుగనున్న రెండో టెస్టుకు ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ తమ తుది జట్టును ప్రకటించాడు. పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ గాయం కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో.. అతడి స్థానంలో జై రిచర్డ్‌సన్‌ను ఆడించనున్నట్లు పేర్కొన్నాడు. కాగా రిచర్డ్‌సన్‌కు ఇదే తొలి యాషెస్‌ టెస్టు కావడం గమనార్హం. ఇక పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఈ మ్యాచ్‌కు దూరమవుతాడన్న వార్తలు వచ్చాయి. అయితే, కమిన్స్‌ మాత్రం వార్నర్‌ రెండో టెస్టు ఆడటం ఖాయమని స్పష్టం చేశాడు. 

కాగా ఆసీస్‌- ఇంగ్లండ్‌ మధ్య అడిలైడ్‌ వేదికగా డిసెంబరు 16 నుంచి రెండో టెస్టు మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఓవల్‌ మైదానంలో జరిగే ఈ పింక్‌ బాల్‌ టెస్టులో ఎలాగైన విజయం సాధించాలని జో రూట్‌ బృందం భావిస్తుండగా.. ఆధిక్యాన్ని పెంచుకోవాలని కమిన్స్‌ టీమ్‌ పట్టుదలగా ఉంది. ఇక గబ్బాలో జరిగిన మొదటి టెస్టులో ఆసీస్‌ విజయం ఏకపక్ష సాధించిన విషయం తెలిసిందే. 9 వికెట్ల తేడాతో గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉంది.

యాషెస్‌ సిరీస్‌ 2021-22.. రెండో టెస్టుకు ఆసీస్‌ తుది జట్టు:
మార్కస్‌ హారిస్‌, డేవిడ్‌ వార్నర్‌, మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, ట్రావిస్‌ హెడ్‌, కామెరూన్‌ గ్రీన్‌, అలెక్స్‌ క్యారీ(వికెట్‌ కీపర్‌), పాట్‌ కమిన్స్‌(కెప్టెన్‌), మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లియాన్‌, జై రిచర్డ్‌సన్‌.

చదవండి: Ind Vs SA Test Series: రోహిత్‌ లేడు.. రహానే, పుజారా, అశ్విన్‌ కానే కాదు.. అతడే వైస్‌ కెప్టెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement