ముగిసిన ఇంటర్ పరీక్షలు
సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్ విద్యార్థులకు బుధవారంతో పరీక్షలు ముగిశాయి. ఒకేషనల్ బ్రిడ్జికోర్సు, హెచ్‌సీఎంఎల్ గ్రూపు విద్యార్థులకు ఏప్రిల్ 4వ తేదీవరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనం స్థానిక బాలుర కళాశాలలో ప్రారంభమైందని జిల్లా ఇంటర్ విద్యాధికారి సూర్యప్రకాశ్ చెప్పారు. అధ్యాపకులు తప్పనిసరిగా స్పాట్‌కు హాజరుకావాలని, రానివారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రాక్టికల్ విధులకు హాజరుకాని అధ్యాపకులపై చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానా విధించామన్నారు. ఈ నెల 31న ఇంగ్లిష్, తెలుగు, మ్యాథ్స్, సివిక్స్, ఏప్రిల్ 4న ఫిజిక్స్, ఎకనామిక్స్, 6న కెమిస్ట్రీ, కామర్స్, 9న హిస్టరీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టుల అధ్యాపకులు రిపోర్టు చేయాలన్నారు.