వారంటీ లేని గ్యారంటీలు నమ్మొద్దు | Sakshi
Sakshi News home page

వారంటీ లేని గ్యారంటీలు నమ్మొద్దు

Published Fri, Nov 17 2023 4:24 AM

న్యాల్‌కల్‌ : మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు, పక్కన మాణిక్‌రావు - Sakshi

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): కాంగ్రెస్‌ పార్టీ ఇస్తానంటున్న వారంటీ లేని గ్యారంటీ పథకాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం న్యాల్‌కల్‌ మండల పరిధిలోని హద్నూర్‌ గ్రామంలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. సభకు హాజరైన మంత్రి హరీశ్‌రావుకు పార్టీ మండల నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. పక్కనున్న కర్నాటకలో సాధ్యం కాని హామీలను ఇచ్చి వాటిని నెరవేర్చడంలో కాంగ్రెస్‌ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అక్కడ 24 గంటలు కరెంటు ఇస్తామన్న కాంగ్రెసోళ్లు ఇప్పుడు కనీసం 5 గంటలు కూడా ఇవ్వడం లేదన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాణిక్‌రావు మాట్లాడుతూ.. మరోసారి తనను ఆశీర్వదించి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు.ఎంపీ బీబీపాటిల్‌, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ నరోత్తం, మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ తన్వీర్‌ అహ్మద్‌, తదితరులు మాట్లాడారు. అలాగే, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్‌, బీఎస్పీ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి కండువాలు కప్పిన మంత్రి హరీశ్‌రావు పార్టీలోకి ఆహ్వానించారు. బీఎస్పీకి చెందిన నాయకుడు రాహుల్‌తోపాటు దత్తారెడ్డి, తదితరులు చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో ఎన్నికల ఇన్‌చార్జి దేవి ప్రసాద్‌, ఉమ్మడి మెదక్‌ జిల్లా డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌, సీడీసీ చైర్మన్‌ ఉమాకాంత్‌ పాటిల్‌, ఎంపీపీ అధ్యక్షురాలు అంజమ్మ, ఉపాధ్యక్షుడు గౌసొద్దీన్‌, జెడ్పీటీసీ సభ్యురాలు స్వప్న భాస్కర్‌, పార్టీ మండల అధ్యక్షుడు రవిందర్‌, మాజీ అధ్యక్షుడు నర్సింహా రెడ్డి, మాజీ జెడ్పీటీసీ చంద్రప్ప, హద్నూర్‌ సర్పంచ్‌ వీర మణి రాజ్‌కుమార్‌తో పాటు శ్రీకాంత్‌రెడ్డి, దెశెట్టి పాటిల్‌, రవికుమార్‌, శ్రీనివాస్‌, పాండురంగారెడ్డి, పీటర్‌ రాజు, ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

కర్నాటకలో హామీలపై ఆరా..

కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌, అక్కడ అమలు చేస్తున్న హామీల తీరుపై మంత్రి హరీశ్‌రావు ఆరా తీశారు. సభ ప్రారంభం కాగానే కర్నాటకలో కాంగ్రెస్‌ వాగ్ధానాలను ఏ మేరకు అమలు చేస్తుందో అక్కడి వారితో బంధుత్వాలు ఉన్న వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్‌ ఫ్యాక్టరీలో పని చేస్తున్న హద్నూర్‌ గ్రామానికి చెందిన మల్లేశ్‌, మెటల్‌కుంటకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు రాజేందర్‌రెడ్డి సభావేదిక పైకి మంత్రి పిలిచి అడిగాడు. అక్కడ కరెంట్‌ 5 గంటలే ఇస్తున్నారని, పింఛన్‌ కూడా తక్కువగా వస్తుందని, రైతు బంధు అసలు ఇవ్వడం లేదని వారు తెలిపారు. ఇలాంటి కాంగ్రెస్‌ పార్టీ కావాలా? లేక బీఆర్‌ఎస్‌ పార్టీ కావాలా? అని ప్రజలను మంత్రి ప్రశ్నించారు.

హ్యాట్రిక్‌ విజయం సాధిస్తాం

కోహీర్‌(జహీరాబాద్‌): సీఎం కేసీఆర్‌ సారథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ హ్యాట్రిక్‌ విజయం సాధింస్తుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం మండల కేంద్రమైన కోహీర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. అధికారంలోకి రాగానే కోహీర్‌కు డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తామన్నారు. నూతన బస్టాండ్‌ను సైతం నిర్మించి ఇస్తామన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ స్రవంతిరెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు నర్సింహులు యాదవ్‌, రామకృష్ణారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, జావేద్‌, కలీం, అన్నాన్‌ జావేద్‌, భూమయ్య, వెంకట్‌రాంరెడ్డి, ఆనంద్‌, సందీప్‌, మొల్లయ్య, బాబీ, సిద్దప్ప, సజ్జన్‌ పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌తోనే బంజారాల సంక్షేమం

జహీరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే బంజారాల (గిరిజన) సంక్షేమం సాధ్యపడుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం జహీరాబాద్‌ పట్టణంలోని శెట్కార్‌ ఫంక్షన్‌ హాల్‌లో బీఎస్‌ఎన్‌ డైరెక్టర్‌, సర్పంచ్‌ శంకర్‌ నాయక్‌ అధ్యక్షతన గిరిజన సదస్సు నిర్వహించారు. మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు గిరిజనులను పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. కేసీఆర్‌ సీఎం అయ్యాకే పోడు భూములకు పట్టాలు ఇచ్చామని అన్నారు. జహీరాబాద్‌ ప్రాంతంలోని 593 మంది రైతులకు 1,393 పోడుభూములపై హక్కులు కల్పించామన్నారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్‌, మాజీ ఎంపీ సీతారాంనాయక్‌, ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ వై.నరోత్తం, ఐడీసీ చైర్మన్‌ తన్వీర్‌, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దేవిప్రసాద్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎం.శివకుమార్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు శంకర్‌ నాయక్‌, ఉమాకాంత్‌ పాటిల్‌, కిషన్‌రావు పవార్‌, విజయ్‌ మోహన్‌రెడ్డి, చిరంజీవిప్రసాద్‌, కుత్‌బుద్దీన్‌, విజయ్‌కుమార్‌, సుధీర్‌కుమార్‌, నామ రవికిరణ్‌, మాణిక్యమ్మ, యాకూబ్‌, నరేశ్‌, మోతిరాం, జహంగీర్‌, సంజీవరెడ్డి పాల్గొన్నారు. అలాగే, పట్టణంలోని బసవ మండపంలో సామాజిక వర్గాలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి హరీశ్‌రావు, ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు హాజరయ్యారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకటేశం, మంకాల్‌ సుభాష్‌, అల్లాడి నర్సింహులు, ముత్యాలచందు, ఎం.డి.తంజీం, తట్టు నారాయణ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ నాయకులు ఇచ్చే సీసా, పైసలకు ఆశపడి ఓటు వేయొద్దు ప్రజా ఆశీర్వాద సభలో

మంత్రి హరీశ్‌రావు

పటాచెరుటౌన్‌: బీఆర్‌ఎస్‌ అంటే నమ్మకం.. కాంగ్రెస్‌ అంటే నాటకం అని, కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు కాదు.. ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి మారుతాడని హరీశ్‌రావు ఎద్దేశ చేశారు. పటానన్‌చెరు మండలం ఇస్నాపూర్‌ గ్రామ చౌరస్తాలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచార సభకు హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి సమక్షంలో ఇస్నాపూర్‌ మాజీ సర్పంచ్‌ మల్లారెడ్డి, చిట్కుల్‌ మాజీ సర్పంచ్‌ చిన్న రాములు, ఇస్నాపూర్‌ వార్డు సభ్యులు జనార్దన్‌ రెడ్డి, నారాయణ, ఊర్ల గోపాల్‌, సంపత్‌ కుమార్‌ రెడ్డి, చిట్కుల్‌ వార్డు సభ్యులు నర్సింగ్‌ యాదవ్‌ తదితరులు పార్టీలో చేరగా వారికి కండువా వేసి మంత్రి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీని నమ్ముకుంటే ఇక మిగిలేది అంధకారమే, ఎవరెన్ని కుట్రలు చేసినా కాబోయే ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి, హ్యాట్రిక్‌ సీఎం కేసీఆర్‌ అని ధీమా వ్యక్తం చేశారు. అమీన్‌పూర్‌లో నిర్వ హించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.

మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు
1/1

మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

Advertisement
Advertisement