ఆత్మరక్షణకు కరాటే దోహదం | - | Sakshi
Sakshi News home page

ఆత్మరక్షణకు కరాటే దోహదం

Jun 9 2025 7:52 AM | Updated on Jun 9 2025 7:52 AM

ఆత్మరక్షణకు కరాటే దోహదం

ఆత్మరక్షణకు కరాటే దోహదం

చేవెళ్ల: కరాటే ఆత్మరక్షణతో పాటు శారీర దృఢత్వానికి దోహదపడుతుందని కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి పామెన భీంభరత్‌ అన్నారు. మండల కేంద్రంలోని స్పోర్ట్స్‌ స్డేడియంలో ఆదివారం జపాన్‌ కరాటే అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కరాటే మాస్టర్‌ కె.కృష్ణ నిర్వహించిన కరాటే శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా కరాటే బెల్టుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన వారికి బెల్టులు ప్రదానం చేశారు. అనంతరం శిక్షణ అందించిన మాస్టర్‌ కృష్ణను అభినందించారు. కార్యక్రమంలో కరాటే బెల్ట్‌ల చీఫ్‌ ఎగ్జామినర్‌, 8వ బాక్ల్‌ బెల్టు డాన్‌ ఎండీ ఖాజాపాషా, అర్గనైజర్లు బ్లాక్‌ బెల్టు డాన్‌లు జంగయ్య, రాములు, యూత్‌ కాంగ్రెస్‌ మండల మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement