
కొత్త పుస్తకాలొచ్చాయ్
ఇబ్రహీంపట్నం రూరల్: బడిబాట కార్యక్రమంలో భాగంగా రాబోయే నూతన విద్యా సంవత్సరానికి కొత్త పుస్తకాలు వచ్చాయి. ఇప్పటికే విద్యా వనరుల కేంద్రానికి ప్రభుత్వం పుస్తకాలను చేరవేసింది. ఇబ్రహీంపట్నం మండలంలోని 49 ప్రభుత్వ పాఠశాలల్లో 5,600 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి 41,867 పుస్తకాలు కావాల్సి ఉంది. ఇప్పటికి 21,900 విద్యా వనరుల కార్యాలయంలో నిల్వ ఉన్నాయి. ప్రస్తుతానికి 50 శాతం మాత్రమే పుస్తకాలు వచ్చాయని మరో 50 శాతం బడులు తెరుచుకునేలోపు వస్తాయని అధికారులు తెలిపారు. తరగతుల వారీగా ఆయా పాఠశాలలకు చేరవేస్తామని చెప్పారు.
మాల్‌ను సందర్శించిన డిప్యూటీ కమిషనర్లు
యాచారం: రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ కమిషనర్లు వెస్లీ, రవీందర్ మంగళవారం ఆత్మనిర్భర్ నేషనల్ పంచా యతీ అవార్డు దక్కించుకున్న మాల్ గ్రామాన్ని సందర్శించారు. అవార్డు రావడానికి కలిసొచ్చి న ఆర్థిక అంశాలపై అధ్యయనం చేశారు. ఐదేళ్లుగా పశువుల సంత ద్వారా గ్రామ పంచాయతీకి వస్తున్న ఆదాయం, గ్రామం అభివృద్ధి చెందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. అనంతరం పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. గ్రామంలోని పలు కాలనీల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌మోహన్, ఇబ్రహీంపట్నం డివిజన్ పంచాయతీ అధికారి సాధన, ఇన్‌చార్జి ఎంపీడీఓ శైలజ, మండల పంచాయతీ అధికారి శ్రీలత, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు ఉన్నారు.
రైతులు అధిక దిగుబడితో ఆదర్శంగా నిలవాలి
యాచారం: కూరగాయలు, ఆకుకూరల దిగుబడి సాధించి ఆదర్శంగా నిలవాలని జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు అన్నారు. రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన మండల పరిధిలోని చౌదర్‌పల్లిలో మంగళవారం రైతు సంక్షేమ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పైలెట్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని రైతులు రాయితీపై అందజేసే వ్యవసాయ యంత్ర పరి కరాలు, డ్రిప్, స్ప్రింక్లర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లను పొందాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు నమోదు ప్రక్రియను తెలియజేశారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి సురేష్‌కుమార్ వ్యవసాయ, పండ్లతోటల పెంపకం గురించి వివరించారు. డ్రిప్ పద్ధతి ద్వారా తక్కువ నీటితో అధిక దిగుబడి పొందొచ్చని తెలిపారు. సమావేశంలో ఇబ్రహీంపట్నం డివిజన్ ఏడీఏ సుజాత, మండల వ్యవసాయాధికారి రవినాథ్, ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి నవీన తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
అనంతగిరి: హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ప్రభుత్వ మహిళా టెక్నికల్ సంస్థ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను తల్లిదండ్రులు కోల్పోయిన బాలికల నుంచి, అక్రమ రవాణాకు గురైన, దివ్యాంగ బాలికల నుంచి మూడేళ్ల టెక్నికల్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారి జయసుధ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ కమ్యూనికే షన్ ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో సీట్లు ఉన్నాయని తెలిపారు. అమ్మాయిలు పాలిటె క్నిక్ అర్హత ప్రవేశ పరీక్ష రాయకున్నా కనీసం పదో తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలన్నారు. ఈ నెల 20వ తేదీలోపు వికారాబాద్‌లోని బాలరక్ష భవన్‌లో అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు 96408 63896, 98496 72296 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

కొత్త పుస్తకాలొచ్చాయ్