
గోవా మద్యం స్వాధీనం
కంభం/గిద్దలూరు రూరల్: అక్రమంగా గోవా మద్యం తరలిస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు రెండు చోట్ల చిక్కినట్టే చిక్కి పారిపోయారు. గిద్దలూరు, కంభం ఎకై ్సజ్ సీఐలు శనివారం తమ కార్యాలయాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు, మార్కాపురం ఏఈఎస్‌టీఎఫ్ సిబ్బందితో కలిసి ఆర్పీఎఫ్ అధికారుల సహకారంతో కంభం రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించగా ఒక బ్యాగులో 4.7 లీటర్ల గోవా లిక్కర్ పట్టుబడింది. గుర్తు తెలియని నిందితుడు పారిపోయాడని ఎకై ్సజ్ సీఐ కొండారెడ్డి తెలిపారు. గిద్దలూరు రైల్వేస్టేషన్‌లో 7 గోవా మద్యం బాటిళ్లు సీజ్ చేశామని, నిందితుడు తప్పించుకున్నాడని స్థానిక ఎకై ్సజ్ పోలీసులు చెప్పారు. ఒకే రోజు రెండు సంఘటల్లో నిందితులు పారిపోయారని చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గిద్దలూరులో స్వాధీనం చేసుకున్న గోవా మద్యం

గోవా మద్యం స్వాధీనం