
ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని వ్యక్తి మృతి
కొత్తపట్నం: ఆగి ఉన్న ట్రాక్టర్‌ను బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన ఈతముక్కల గ్రామంలో చెత్త సంపద తయారీ కేంద్రం వద్ద శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. టంగుటూరు మండలం వాసేపల్లిపాడు గ్రామానికి చెందిన దూడల నారాయణ(40) వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శనివారం ఈతముక్కలలో రొయ్యలు కొనుగులు చేసి తన బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. గ్రామ శివారులో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్‌ను బైక్ అదుపు తప్పి ఢీకొనడంతో నారాయణకు బలమైన గాయాలై స్పహ కోల్పోయాడు. స్థానికులు 108 అంబులెన్స్‌లో ఒంగోలు జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. ఎస్‌ఐ సుధాకర్‌బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.