
వైఎస్సార్ సీపీలో చేరిన వార్డు సభ్యుడు
పెద్దదోర్నాల: కూటమి ప్రభుత్వ విధానాలు నచ్చక పెద్దదోర్నాల మండలం నల్లగుంట్ల గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు పందీటి అనిల్ గురువారం యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. టీడీపీని వీడిన అనిల్‌కు యర్రగొండపాలెంలోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే తాటిపర్తి వైఎస్సార్ సీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ గంటా వెంకట రమణారెడ్డి, మొద్దు తిరుపతిరావు, భైరబోయిన శ్రీను(గాంధీ), పార్టీ నాయకులు సీమోను, చిన్ని, వాదం శ్రీను, సంజీవమ్మ, కొట్టి రోజ్మేరీ పాల్గొన్నారు.
ఆహ్వానించిన ఎమ్మెల్యే తాటిపర్తి