
కొనకనమిట్ల ఎస్సైగా ప్రభాకర్‌రెడ్డి
కొనకనమిట్ల: కొనకనమిట్ల ఎస్సైగా జి.ప్రభాకర్‌రెడ్డి బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఒంగోలులో పనిచేస్తున్న ఆయన బదిలీపై కొనకనమిట్లలో నియమితులయ్యారు. నూతన ఎస్సై ఏఎస్సై ముల్లా సాహెబ్, స్టేషన్ సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కాగా ఇప్పటి వరకు ఎస్సైగా విధులు నిర్వర్తించిన టి.రాజ్‌కుమార్ అంకిత భావంతో పనిచేయక పోవడం, స్టేషన్‌లో రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం, పోలీస్ స్టేషన్‌కు వచ్చేవారికి అందుబాటులో లేకపోవడం తదితర ఆరోపణల నేపథ్యంలో వీఆర్‌కు బదిలీ అయ్యారు.