పంజాబ్‌ రైతుల చావులే కనిపిస్తాయా?  | YS Sharmila Comments On CM KCR | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ రైతుల చావులే కనిపిస్తాయా? 

May 26 2022 5:59 AM | Updated on May 26 2022 5:59 AM

YS Sharmila Comments On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేవలం పంజాబ్‌ రైతుల చావులే కనిపిస్తాయా? అని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్‌లో వడ్లకుప్ప దగ్గర రైతు గుడిసె సిద్ధరాములు మరణానికి కేసీఆర్‌ నిర్లక్ష్యమే కారణమని ఆమె బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.

మరణించిన రైతు రాములు కుటుంబానికి సానుభూతి తెలిపారు. కొంటారో కొనరో తెలియక కుప్పల వద్దే రైతుల గుండెలు ఆగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతుల చావులు కేసీఆర్‌ కంటికి కనిపించవు.. చావు కేకలు వినిపించవని విమర్శించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement