బీజేపీ దరఖాస్తుల ఉద్యమంపై కేటీఆర్‌ కౌంటర్‌ | Minister KTR Counter To BJP And Bandi Sanjay Over Applications Campaign | Sakshi
Sakshi News home page

బీజేపీ దరఖాస్తుల ఉద్యమంపై కేటీఆర్‌ కౌంటర్‌

Aug 17 2021 11:05 AM | Updated on Aug 17 2021 11:05 AM

Minister KTR Counter To BJP And Bandi Sanjay Over Applications Campaign - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య దరఖాస్తుల గోల ముదురుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ చేపట్టిన దరఖాస్తుల ఉద్యమంపై మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా కౌంటర్‌ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇస్తానన్న రూ.15 లక్షల కోసం బీజేపీ నేతలకు ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు అమలయ్యేలా ఒత్తిడి తీసుకొచ్చి, రాష్ట్ర ప్రజలకు మేలు చేకూర్చేందుకే దరఖాస్తుల ఉద్యమాన్ని బీజేపీ చేపట్టిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.

అదే విధంగా దళితబంధు కోసం దరఖాస్తు ఉద్యమం ప్రారంభించామన్నారు. ఈ నెల 24 నుంచి చేపట్టనున్న ‘ప్రజా సంగ్రామయాత్ర’లో పాదయాత్ర పొడవునా దరఖాస్తుల ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement