నేతిబీరకాయలో నేతి లాంటిదే.. నీతి ఆయోగ్‌లోని నీతి: మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

KTR Responds Professor Nageshwar Tweet KCR Absence Of Niti Aayog Meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నీతి ఆయోగ్‌ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరై.. ప్రధానిని ప్రశ్నించి ఉండాల్సిందని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ చేసిన ట్వీట్‌పై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ‘అయిననూ పోయి రావలె హస్తినకు’అనేది పాత మాట అని ట్వీట్‌ చేశారు. ‘ఈ కేంద్ర ప్రభుత్వం పక్షపాత, వివక్షాపూరితమైన మనస్తత్వంతో గతంలో నీతి ఆయోగ్‌ సిఫార్సులను బుట్టదాఖలు చేసింది’అని పేర్కొన్నారు. ‘నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో.. నీతి ఆయోగ్‌లో నీతి కూడా అంతే’అని వ్యాఖ్యానించారు. అందుకే సీఎం కేసీఆర్‌ నీతి ఆయోగ్‌ భేటీని బహిష్కరించారన్నారు. 
(చదవండి:  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి ఆత్మహత్య )

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top