అమరేశ్వరాలయంలో కాలభైరవస్వామికి పూజలు | - | Sakshi
Sakshi News home page

అమరేశ్వరాలయంలో కాలభైరవస్వామికి పూజలు

Nov 29 2025 7:33 AM | Updated on Nov 29 2025 7:33 AM

అమరేశ

అమరేశ్వరాలయంలో కాలభైరవస్వామికి పూజలు

అమరేశ్వరాలయంలో కాలభైరవస్వామికి పూజలు అమరావతి: అమరావతిలోని అమరేశ్వరాలయంలో కాలభైరవాష్టమి సందర్భంగా దేవాలయంలోని కాలభైరవస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం స్వామివారికి భక్తుల సమక్షంలో అర్చకులు కైతేపల్లి సుధీర్‌శర్మ ఆధ్వర్యంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం ఏడుగంటలకు అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమరేశ్వరాలయానికి చేరుకుని రెండో ప్రాకారంలో ఉన్న కాలభైరవస్వామికి పూజలు నిర్వహించిన అనంతరం అమరేశ్వరు న్ని దర్శించుకున్నారు. పలు గ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. వసంతరావుకు ఇండియన్‌ పోలీస్‌మెడల్‌ వైభవంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవం సరస్వతీ దేవాలయం నిర్మాణ పనులకు అంకురార్పణ

అమరావతి: లింగాపురం గ్రామానికి చెందిన కొచ్చిరి వసంతరావు ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ అందుకోవటంపై లింగాపురం గ్రామస్తులు, స్నేహితులు, అప్పటి సహ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశా రు. నిరుపేద కుటుంబంలో జన్మించిన వసంతరావు శ్రీ రామకృష్ణ హిందూ హైస్కూల్‌లో పదవ తరగతి, ఇంటర్‌, డిగ్రీ ధరణికోట రాజావాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కళాశాలలో చదివారు. 1991లో కేంద్ర హోం శాఖలో చేరి అంచెలంచెలుగా ఎదిగి 2025 రిపబ్లిక్‌ డేనాడు ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ అవార్డుకు ఎంపిక య్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఇంటిలిజెన్స్‌ విభాగంలో పనిచేస్తున్న వసంతరావు శుక్రవారం చత్తీస్‌గడ్‌లోని రాయపూర్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేతుల మీదుగా ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ అందుకున్నారు.శ్రీరామకృష్ణ హిందూ హైస్కూల్‌లో 1981–82 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థు లంతా తమ తోటి విద్యార్థి జాతీయ స్థాయిలో ఘనత సాధించినందుకు హర్షంవ్యక్తం చేశారు.

నగరంపాలెం(గుంటూరు ఈస్ట్‌) : గుంటూరులోని లక్ష్మీపురం ఆనం మెడికల్‌ హబ్‌ వద్ద శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి మహా పడిపూజ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రెండు రోజులుగా నిర్వహిస్తోన్న పడిపూజ శుక్రవారం తెల్లవారుజామున ముగిసింది. శబరిమల ఆచారం ప్రకారం పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గురుస్వామి ఏ.శ్రీనివాసన్‌ నాయర్‌ నేతృత్వంలో పూజలు చేపట్టగా, సంతోష్‌ స్వామి బృందం అయ్యప్ప, భవానీ పూజలను భక్తితో నిర్వహించారు. వందలాది మంది భక్తులకు పూజ కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. పడిపూజ మహోత్సవం లో సీనియర్‌ వైద్యులు ఆర్‌.మురళీబాబురావు, బీవీ.సుధీర్‌బాబు, వంశీకృష్ణ, శ్రీబాలసుధ డయాగ్నస్టిక్స్‌ నిర్వాహాకులు ఆనం సంజీవరెడ్డి, బాలబాణి, వైద్యులు ఆనం గోపాల్‌రెడ్డి, నర్మదాసాయి, లక్ష్మీరెడ్డి, రెడ్డి అంకమ్మరెడ్డి, వంగా సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

తెనాలి: పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీప్రజ్ఞానంద సరస్వతి (బాలస్వామీజీ) ఆధ్వర్యంలో బుర్రిపాలెం రోడ్డులో సువర్ణభారతి క్షేత్ర సరస్వతీ దేవాలయం నిర్మాణ పనులకు శుక్రవారం అంకురార్పణ చేశారు. నీటిపంపు వేయటం ద్వారా గంగ పూజిత పనులను అక్కడ ఆరంభించారు. మహిళలతో లలితా సహస్ర పారాయణం, విష్ణుసహస్ర పారాయణం, హ నుమాన్‌ చాలీసా పారాయణం చేయించారు. భక్తులచే ప్రత్యేక పూజలు చేయించారు. కార్యక్రమంలో శ్రీసాలిగ్రామ మఠం ట్రస్ట్‌ సంయుక్త కార్యదర్శి ముద్దాభక్తుని రమణయ్య, గోపు రామకష్ణ, రావూరి సుబ్బారావు, గొడవర్తి సాయి హరేరామ్‌, మాజేటి గోపి పాల్గొన్నారు.

అమరేశ్వరాలయంలో  కాలభైరవస్వామికి పూజలు 1
1/1

అమరేశ్వరాలయంలో కాలభైరవస్వామికి పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement