లింగ వివక్ష తగదు
నయీ చేతన్ ర్యాలీని ప్రారంభించిన ఇన్‌చార్జి కలెక్టర్ గాంధీ పార్కులో మహిళల మానవహారం ఏర్పాటు
నరసరావుపేట: లింగ వివక్ష, మహిళా సాధికారత, ఆస్తుల్లో నిర్ణయాధికారం, సమాన పనికి సమాన వేతనం అంశాలపై అవగాహన కోసం మంగళవారం గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహిళలు నయీ చేతన్ 4.0 ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ర్యాలీని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సూరజ్ ధనుంజయ గనోరే ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించారు. లింగ వివక్ష వద్దు, సమానత్వమే ముద్దు, సీ్త్ర, పురుష సమానత్వం దేశ ప్రగతికి సమానం, ఇంటిపని అందరిపని అంటూ నినాదాలు చేస్తూ మహిళలు ర్యాలీగా బయలుదేరి స్టేషన్‌రోడ్డులోని గాంధీపార్కుకు చేరుకున్నారు. అక్కడ ఉన్న తెలుగుతల్లి విగ్రహం చుట్టూ మానవహారంగా ఏర్పడ్డారు. దీనిలో డీఆర్‌ఓ ఏకా మురళి, ఆర్డీఓ కె.మధులత, డీఆర్‌డీఏ పీడీ ఝాన్సీరాణి, ఐసీడీఎస్ పీడీ ఉమాదేవి, సోషల్ వెల్ఫేర్ పీడీ, అంగన్వాడీ టీచర్లు, మహిళలు పాల్గొన్నారు.
లింగ వివక్ష తగదు


