
పునీత థామస్‌వారి అడుగుజాడల్లో నడవాలి
తుమృకోట(రెంటచింతల): క్రీస్తు సూక్తులను నిత్యం ఆచరిస్తూ పునీత థామస్‌వారు క్రైస్తవులకు ఆదర్శంగా నిలిచారని ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడలలో నడిచి సమాజంలో నిజమైన క్రైస్తవులుగా జీవించాలని రెవ.ఫాదర్ ఎం.రాజరత్నం అన్నారు. గురువారం తుమృకోట గ్రామంలో నున్న పునీత థామస్‌వారి చర్చి 125వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విచారణ గురువులు మాలై పవిత్రన్ ఆధ్వర్యంలో రెవ.ఫాదర్ కొణతం ఎలీషారాజుతో కలిసి సమష్టి దివ్యపూజాబలి సమర్పించి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. పల్నాడు ప్రాంతంలోనే తుమృకోట చర్చి అతి పురాతనమైందన్నారు. అపోస్తులు 12 మందిలో ఒకరైన థామస్ వారు భారతదేశంలో మొట్టమొదటిసారి క్రీస్తు సువార్తను ప్రచారం చేశారని గుర్తుచేశారు. భక్తులకు పులిహార పంపిణీ చేశారు. పెద్దలు అశోక్, మల్లి, దుగ్గింపూడి శౌరి రాయపురెడ్డి, రెంటచింతల కానుకమాత చర్చి దళ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
రెవ.ఫాదర్ రాజరత్నం వైభవంగా పునీత థామస్‌వారి చర్చి 125వ వార్షికోత్సవం

పునీత థామస్‌వారి అడుగుజాడల్లో నడవాలి