
గుండెపోటుతో హోంగార్డు మృతి
వినుకొండ: వినుకొండ టౌన్ పోలీస్టేషనులో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు విజయ్‌బాబు (35) శనివారం గుండెపోటుతో మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న ౖటౌన్ సీఐ శోభన్‌బాబుతో పాటు పోలీసుసిబ్బంది విజయ్‌బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం తరపునుంచి రావాల్సిన సాయం అందించేందుకు కృషి చేస్తామని భరోసాఇచ్చారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై కేసు
నరసరావుపేట రూరల్: పల్నాడు జిల్లా ములకలూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త షేక్ ఇర్ఫాన్‌పై రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై ఇర్ఫాన్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు మండలంలోని లింగంగుంట్లకు చెందిన జనసేన పట్టణ కార్యదర్శి అప్పిశెట్టి లక్ష్మీనారాయణ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఇర్ఫాన్‌పై శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు. శనివారం అరెస్ట్ చేసి కోర్టులో హజరుపర్చినట్టు రూరల్ ఎస్‌ఐ కిషోర్ తెలిపారు.
రేపటి నుంచి ఉచిత యోగ శిక్షణ శిబిరం
నరసరావుపేట ఈస్ట్: శ్రీవేంకటేశ్వర యోగ సేవా కేంద్రం నరసరావుపేట శాఖ ఆధ్వర్యంలో ఈనెల 9వతేది నుంచి 187వ ఉచిత యోగ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్టు యోగా గురూజీ కూనిశెట్టి వెంకటజనార్థన్ శనివారం తెలిపారు. శ్రీపట్టాభిరామస్వామి ఆలయంలోని శ్రీవెంకటేశ్వర కళ్యాణ మండపంలో ప్రతిరోజు ఉదయం 5గంటల నుంచి 7గంటల వరకు 28 రోజుల పాటు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. శిబిరంలో 42 యోగ భంగిమలు, ప్రాణాయామం, ధ్యానం, ఆహార నియమాలు, సూర్య నమస్కారాలు బోధించనున్నట్టు తెలిపారు. శిక్షణకు హాజరయ్యే అభ్యాసకులు యోగా మ్యాట్ వెంట తెచ్చుకోవాలని సూచించారు. వివరాలకు 9490846333, 9491665733 నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.