
రోడ్డుపై ధాన్యం పోసి రైతుల ఆందోళన
కొరాపుట్: రోడ్డుపై ధాన్యం పోసి రైతులు ఆందోళనకు దిగారు. శనివారం కొరాపుట్ జిల్లా జయపూర్ సబ్ డివిజన్ కొట్‌పాడ్ సమితిలో జాతీయ రహదారిపై రైతులు ధాన్యం పోసి నిరసన తెలిపారు. ఈ ప్రాంతంలోని డుంగ్రి ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వివాదం కొనసాగుతోంది. ఇక్కడ సుమారు 600 మంది రైతులకు చెందిన సుమారు 10 వేల క్వింటాళ్ల ధాన్యం ఉంది. వాటిని కొనుగోలు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. కాల పరిమితి తీరి పోతున్నందున ధాన్యం కొనుగోలు చేయాలని పలు మార్లు రైతులు విజ్ఞప్తి చేశారు. చివరకు జయపూర్‌లో సబ్ డివిజన్ కార్యాలయాలకు వినతి పత్రాలు సమర్పించారు. రథయాత్ర తర్వాల రోడ్ల పైకి దిగుతామని ముందే హెచ్చరించారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసిపోతోంది. దీంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ధాన్యం రోడ్లపై వేసి ఆందోళనకు దిగారు.

రోడ్డుపై ధాన్యం పోసి రైతుల ఆందోళన