
తుపాకులు కలిగి ఉన్న ఇద్దరు అరెస్టు
పర్లాకిమిడి: అను మతి లేకుండా తుపాకులు కలిగి ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి ఆదర్శపోలీసు స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రఫుల్ల జగరంగ తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా గుసాని సమితి తులసిపాడు, డాక్టర్ బంజిరి వద్ద ఇద్దరు వ్యక్తులు ఎస్‌బీఎంఎల్ (సింగిల్ బ్యారిల్ లోడింగ్) తుపాకులతో పట్టుబడ్డారు. వీరిని పోలీసులు విచారించగా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని పర్లాకిమిడి ఆదర్శ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో రాయగడ జిల్లా పుట్టాసింగి పంచాయతీ రెజింగ్‌తల్ గ్రామానికి చెందిన అరుణ్ గోమాంగో, ప్రతాప్ గోమంగోగా పోలీసులు గుర్తించారు. వారిపై 112/2025, సెక్షన్.25(1)(ఎ) ఆర్‌మ్స్ చట్టం క్రింద అరెస్టు చేసి బుధవారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు. పబ్లిక్ రక్షణ కింద నిందితులను అదుపులోకి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు ఐఐసీ ప్రశాంత్ భూపతి తెలిపారు.