బాల్కొండ: కాలువల లిఫ్టుల నిర్వహణకు అధికారు లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందు కు రావడం లేదు. దీంతో టెండర్లు పూర్తయ్యేదెన్న డంటూ ఆయకట్టు రైతులు అసహనం వ్యక్తం చేస్తు న్నారు.శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటి సరాఫరా చేసే లక్ష్మి కాలువపై నిర్మించిన ఎత్తిపోతల పథకాల తోపాటు, లక్ష్మి ఎత్తిపోతల పథకం లిప్టుల నిర్వహ ణ కోసం నెలన్నర క్రితం ప్రభుత్వం రూ. 10కోట్ల 47లక్షల 40వేల నిధులను మంజూరు చేసింది. ఈక్రమంలో అధికారులు టెండర్లు పిలిచి నెల రోజు లు గడిచినా ఇప్పటి వరకు ప్రక్రియ పూర్తి కాలేదు. సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకురావడం లేదని సమాచారం.
ఆందోళనలో రైతులు..
ప్రస్తుతం మరో నెల రోజుల్లో యాసంగి సీజన్‌కు నీటి విడుదలను నిలిపివేస్తారు. ఇప్పటికే టెండర్లు పూర్తయి సిద్ధంగా ఉంటే సకాలంలో పనులు ప్రారంభించి వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి ఎత్తిపోతలను సిద్ధంగా ఉంచవచ్చు. కానీ టెండర్లు ఆలస్యంగా పూర్తిచేస్తే నీటి విడుదలకు ఆటంకాలు ఏర్పడుతాయని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి వెంటనే టెండర్ ప్రక్రియ పూర్తిచేసి, పనులు పూర్తయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
లక్ష్మి ఎత్తిపోతల పథకం
లక్ష్మి కాలువపై లిప్టుల నిర్వహణకు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
అధికారులు టెండర్లు పిలిచినా
ముందుకురాని కాంట్రాక్టర్లు
త్వరలో పూర్తిచేస్తాం..
ఎత్తిపోతల పథకాల నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. టెండర్లను ఆహ్వానించినా ఇప్పటి వరకు పూర్తికాలేదు. త్వరలోనే టెండర్లు పూర్తి చేసి, ఖరీఫ్ సీజన్ ప్రారంభం నాటికి లిఫ్టుల మెయింటెనెన్స్ పూర్తి చేస్తాం.
–సురేశ్,
డిప్యూటీఈఈ, మైనర్ ఇరిగేషన్, బాల్కొండ