బబిత ఆ వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాలి | Protest Against Babita For Making Offensive Remarks On Rajiv Gandhi | Sakshi
Sakshi News home page

బబిత దిష్టిబొమ్మ ద‌హ‌నం

Sep 8 2020 8:54 AM | Updated on Sep 8 2020 9:00 AM

Protest Against Babita For Making Offensive Remarks On Rajiv Gandhi - Sakshi

షోలాపూర్ :  మాజీ ప్రధాని, దివంగత రాజీవ్‌గాంధీపై ఇటీవల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందంటూ క్రీడాకారిణి బబితా పోగాట్‌కు వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన నిర్వహించారు. షోలాపూర్‌లో జరిగిన ఈ ఆందోళనలో బబితా పోగాట్‌ దిష్టిబొమ్మను దహనం చేయడంతోపాటు ఆమె పోస్టర్‌ను చెప్పులతో కొట్టి తమ నిరసనలు తెలిపారు. షోలాపూర్‌ పట్టణ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు  స‌హా ప‌లువురు కాంగ్రెస్  కార్యకర్తలు ఈ  ఆందోళనల్లో  పాల్గొన్నారు.  దివంగత రాజీవ్‌గాంధీ క్రీడాకారుల కోసం, యువత కోసం చేసిన సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజకీయ లబ్దికోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. రాజీవ్‌గాంధీపై   చేసిన అనుచిత  వ్యాఖ్యలను  బబితా పొగాట్ వెనక్కి తీసుకోవాలంటూ  డిమాండ్‌ చేశారు.  (పవార్‌, దేశ్‌ముఖ్‌లకు బెదిరింపు కాల్స్‌)

Advertisement
 
Advertisement
Advertisement