వీళ్లు.. ఈ కుర్రాడి తల్లిదండ్రులా? | Name Of The Bihar Student Parents In Examination Form Picture Is Going Viral On Social Media | Sakshi
Sakshi News home page

వీళ్లు.. ఈ కుర్రాడి తల్లిదండ్రులా?

Oct 9 2024 1:09 PM | Updated on Oct 9 2024 1:45 PM

Name of the man Parents the Picture is Going Viral

సోషల్ మీడియా  ఎప్పటికప్పుడు కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంటుంది. కొన్నిసార్లు షాకింగ్ వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వీటిని చూసినప్పుడు ఎవరికీ ఏమాత్రం నమ్మాలని అనిపించదు.

తాజాగా ఒక ఫొటో వైరల్‌గా మారింది. దీనిని చూసినవారు తెగ ఆశ్యర్యపోవడానికి తోడు కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక కుర్రాడికి సంబంధించిన ఎగ్జామినేషన్‌ ఫారం తెగ వైరల్‌ అవుతోంది. ఆ కుర్రాడు బీఏ ఆనర్స్ విద్యార్థి అని తెలుస్తోంది. అతనికి సంబంధించిన ఫారంలో తండ్రి పేరు ‘ఇమ్రాన్ హష్మీ’ అని, తల్లి పేరు ‘సన్నీ లియోన్’ అని రాసి ఉంది. వీరు బాలీవుడ్‌ ప్రముఖులనే విషయం తెలిసిందే.

ఈ ఫోటో వైరల్ అవడానికి ఆ కుర్రాడి తల్లిదండ్రుల పేర్లే ప్రధాన కారణం. అయితే ఇది నిజమా లేక ఎవరైనా ఫోటోను ఎడిట్ చేశారా అనేది స్పష్టం కాలేదు. ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫోటో ఇండియన్‌ రేర్‌ ఇమేజస్‌ అనే పేజీ నుండి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయ్యింది. ఈ పోస్ట్‌ను ఇప్పటివరకూ 2 లక్షల 28 వేల మందికి పైగా యూజర్లు వీక్షించారు. ఈ పోస్ట్ చూసిన  ఒక యూజర్‌ ఆ కుర్రాడి తాత పేరు మహేష్ భట్ అని రాయగా, మరొక యూజర్‌ దీనిని ఫేక్‌ అని పేర్కొన్నాడు.

ఇది కూడా చదవండి: సహారాలో భారీ వర్షాలు.. ఆశ్చర్యపరుస్తున్న దృశ్యాలు

Advertisement
 
Advertisement
Advertisement