Karnataka: Talguppa Bengaluru Intercity SF Express Engine Moves Leaves Bogie Behind - Sakshi
Sakshi News home page

బోగీలను వదిలి  రైలింజన్‌ పరుగులు!

May 27 2023 3:56 PM | Updated on May 27 2023 4:05 PM

Karnataka: Rail Engine Moves Leaves Bogie Behind - Sakshi

శివమొగ్గ(బెంగళూరు): బోగీలను వదిలి రైలింజిన్‌ పరుగులు తీసిన ఘటన శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకా కడదకట్టె రైల్వే లెవల్‌క్రాసింగ్‌ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. తాళగుప్ప–బెంగళూరు ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు శుక్రవారం ఉదయం శివమొగ్గ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. 7.05 గంటలకు భద్రావతికి బయల్దేరింది. భద్రావతి తాలూకా కడదకట్టె రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ వద్దకు రాగానే ఇంజిన్, బోగీలకు మధ్య లింక్‌ ఊడిపోయింది.

ఇంజిన్‌ పరుగులు తీస్తుండగా బోగీలు కొద్ది దూరం వెళ్లి ఆగిపోయాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు భీతిల్లారు. ఇంజిన్‌ వెనుక బోగీలు లేని విషయాన్ని గమనించిన లోకో పైలెట్‌ రైలును నిలిపివేశారు. భద్రావతి, శివమొగ్గ నుంచి సిబ్బంది వచ్చి ఇంజిన్‌ను వెనక్కు తీసుకొచ్చి బోగీలతో కలిపారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

చదవండి: బిల్లులు కట్టొద్దండి..బస్సుల్లో ఉచితంగా ప్రయాణించండి

Advertisement
 
Advertisement
Advertisement