
న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. కొన్ని రోజుల నుంచి 50 వేలకు దిగువన కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కొద్దికొద్దిగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 17,90,708 పరీక్షలు నిర్వహించగా.. 43,393 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. నిన్న కరోనాతో 911 మంది మృత్యువాత పడ్డారు. గురువారం నాడు 44,459 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,58,727 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
ఇప్పటివరకు దేశంలో 33,07,52,950 మంది కరోనా బారినపడ్డారు. మొత్తం 4,05,939 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 2,98,88,284 మంది కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 36,89,91,222 కోట్లకుపైగా టీకా తీసుకున్నారు. నిన్న ఒక్కరోజే 40,23,173 వ్యాక్సిన్ వేయించుకున్నారు.