
ఇంటి యజమాని కోరుకున్న రీతిలో డిజైన్
అందరూ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కిచెన్, లివింగ్ రూం, డబుల్‌బెడ్ రూమ్‌కు ఉడ్ వర్క్‌కు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఉడ్‌వర్క్‌కు సంబంధించి బెంగళూరు, ఢిల్లీ నుంచి తెప్పిస్తాం. ఇంటికి ఇటాలియన్ టైల్స్ వాడితే లుక్కింగ్ గ్రాండ్‌గా ఉంటుంది. సీలింగ్‌లో ప్రొఫైల్ లైట్స్, బాల్కనీలో డబ్ల్యూ పీవీసీ సీలింగ్ బాగుంటుంది. ఉడ్ వర్క్‌లో కిచెన్, బెడ్ రూమ్‌లో 6 ఎంఎం డబ్ల్యూపీవీసీ వాడితే చెదలు రాకుండా లైఫ్ ఎక్కువగా ఉంటుంది. ఇంటి యజమానులు కోరుకున్న రీతిలో వారికి డిజైన్లు చూపించిన ఇంటిని ముస్తాబు చేసి ఇస్తున్నాం.
– జి.దినేష్, ఇంటీరియర్ డిజైనర్, నల్లగొండ
ఆహ్లాదకర వాతావరణం ఉండాలి
ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. అందుకోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అనుభవం ఉంటే తప్ప అందమైన ఇల్లు నిర్మించలేం. ఇంటికి కావాల్సిన డిజైన్లు అన్నీ డిజైనర్లు, అర్కిటెక్షర్ల వద్ద అందుబాటులో ఉంటున్నాయి. ఇంటీరియర్స్ కోసం ఒకప్పుడు హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు నల్లగొండలోనే లభ్యమవుతున్నాయి.
– వై.పద్మ, ఇంటి యజమాని, నల్లగొండ

ఇంటి యజమాని కోరుకున్న రీతిలో డిజైన్